AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima 2025: గురువారం గురు పౌర్ణమి.. ఈ రాశులపై బృహస్పతి ఆశీస్సులు.. చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

ఈ ఏడాది గురు పౌర్ణమి గురువారం రోజున రావడంతో ఈ పండగ మరింత విశిష్టత సంతరించుకుంది. గురు పౌర్ణమి రోజు హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమకు విధ్యబుద్ధులను నేర్పిన గురుదేవుల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు తీసుకొని వారిని పూజించాలి. ఈ ఏడాది గురుపౌర్ణమి పండగ జూలై 10 వ తేదీన వచ్చింది. ఈ రోజున ప్రత్యేక యాదృచ్చికం జరగనుంది. అది ఏమిటో తెలుసుకుందాం.

Guru Purnima 2025: గురువారం గురు పౌర్ణమి.. ఈ రాశులపై బృహస్పతి ఆశీస్సులు.. చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
Guru Purnima
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 2:44 PM

Share

గురు పౌర్ణమ చాలా పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిధిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. 2025 సంవత్సరంలో గురు పూర్ణిమ జూలై 10వ తేదీ గురువారం రోజున వచ్చింది. ఈ రోజున గురు పూర్ణిమ, గురువారం చాలా పవిత్రమైన, అరుదైన యాదృచ్చికం ఏర్పడుతోంది.

గురువారం దేవతల గురువు బృహస్పతి, పౌర్ణమి తిథి గురువుకే అంకితం చేయబడింది. యాదృచ్చికంగా ఈ రోజున చేసే పూజలతో గురువు అనుగ్రహం అనేక రెట్లు పెరుగుతుంది. గురు పూర్ణిమ రోజున గురువు, తల్లిదండ్రులు , ఆచార్యుడికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం చాలా ఫలవంతమైనది. గురు పూర్ణిమ రోజు ఈ 5 రాశుల వారికి చాలా పవిత్రంగా ఉంటుంది, గురు బృహస్పతి అనుగ్రహం ఈ రాశుల వారిపై కురుస్తుంది.

మేష రాశి: జూలై 10, గురు పూర్ణిమ రోజున మేష రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సంకేతాలు ఉండవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు. కుటుంబ జీవితంలో శుభవార్త. పరిహారం-గురు ఓం బ్రిం బృహస్పతయే నమః అనే బీజ మంత్రాన్ని జపించండి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: లాభాలు, వ్యాపారంలో విస్తరణ, కొత్త ఒప్పందాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు ఆశీస్సులతో జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. సమాజంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. అసంపూర్ణ పనులు పూర్తవుతాయి. పరిహారం: అరటి చెట్టును పూజించి పసుపు పువ్వులు సమర్పించండి.

సింహ రాశి: ఈ రాశి వారికి గురు పూర్ణిమ కెరీర్ పరంగా గొప్ప రోజు అవుతుంది, కెరీర్ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. గురువు ఆశీస్సులతో వీరి గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. మీ పిల్లల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. పరిహారం- పేదలకు పసుపు స్వీట్లు పంపిణీ చేయండి.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. పరిహారం- గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు దానం చేయండి.

మీన రాశి: మీన రాశి వారికి అధిపతి గురువు. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలు లభించే అవకాశం ఉంది. వివాహ అవకాశాలు ఉండవచ్చు. విద్య, వృత్తి ,ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనపై ఆసక్తి పెరుగుతుంది. పరిహారం- మీ గురువు లేదా ఆలయానికి పసుపు వస్తువులను దానం చేయండి.

గురు మంత్రం ఏమిటి?

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః” అంటే ఈ శోక్లం అర్థం “గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను”. ఈ శ్లోకం గురువు గొప్పతనాన్ని, దైవంతో సమానమైన స్థానాన్ని తెలియజేస్తుంది.

శివుని గురు మంత్రం ఏమిటి? శివుని గురు మంత్రం “ఓం నమః శివాయ”.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు