రేపే గురుపౌర్ణమి : ఈ నాలుగు రాశుల వారికి అపారమైన ధనప్రాప్తి!
గురు పూర్ణిమ నాలు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. జూలై10న గురు పూర్ణిమను జరుపుకుంటారు. అయితే ఈ రోజు మిథున రాశిలో బృహస్పతి ఉండటం వలన ఇది నాలుగు రాశుల జీవితంలో ఆరోగ్యానికి, సంపద, జ్ఞానం అందించడమే కాకుండా వారికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందంట. కాగా, గురి పూర్ణిమ కారణంగా ఏ రాశుల వారికి ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 09, 2025 | 2:14 PM

మిథున రాశి: మిథున రాశిలో బృహస్పతి సంచారం వలన వీరికి అనేక రకాలుగా కలిసి వస్తుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరిదే పై చేయి అవుతుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు మంచి ఉద్యోగంలో చేరుతారు.

అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. కళారంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

ధనుస్సు రాశి: ధనస్సు రాశి వారికి గురు పూర్ణిమ చాలా ప్రత్యేకమైనదే చెప్పాలి. ఇది మీ జీవితంలో గురువు మొదలైన వారి మార్గదర్శకత్వంలో మీరు ఉంటారు. ఇక ఈ గురు పూర్ణిమ వీరికి చాలా అద్భుతంగా గడిచిపోతుంది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం.

మీన రాశి : మీన రాశి వారికి గురు పూర్ణిమ చాలా అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మాట్లాడటం లేదా, రచన కు సంబంధించిన వృత్తిలో ఉన్నవారు సమాజంలో మంచి గర్తింపును పొందుతారు. కెరీర్ పరంగా చాలా ఉన్నతమైన ఆలోచనలతో దూసుకెళ్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.

కన్యా రాశి: ఈ రాశి వ్యక్తులు వర్క్‌షాప్‌లు, మాస్టర్ ప్రోగ్రామ్‌లు మొదలైన కొత్త జ్ఞానం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. విద్యార్థుల కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీరు తీసుకొనే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తులో పనికొస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇవి మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి.



