AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elinati Shani: త్వరలో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశులకు ఏలినాటి శని నుంచి విముక్తి.. మీరున్నారా చెక్ చేసుకోండి..

శనీశ్వరుడు మందగమనుడు. అతి నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశి లోకి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శనీశ్వరుడు సమయం తీసుకుంటాడు. అందుకే అన్ని రాశుల్లోకి సంచారం చేయడానికి దాదాపు 30 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు శనీశ్వరుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 2025లో మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు

Elinati Shani: త్వరలో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశులకు ఏలినాటి శని నుంచి విముక్తి.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Lord Shanidev
Surya Kala
|

Updated on: Aug 08, 2024 | 7:04 AM

Share

జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు విశిష్ట స్థానం ఉంది. గ్రహాల్లో శనీశ్వరుడిని కర్మ ఫలదాతగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు రెండు, లేదా పన్నెండ స్థానంలో సంచారం చేసిన సమయంలో ఏలినాటి శని దశ మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. శనీశ్వరుడు మందగమనుడు. అతి నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశి లోకి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శనీశ్వరుడు సమయం తీసుకుంటాడు. అందుకే అన్ని రాశుల్లోకి సంచారం చేయడానికి దాదాపు 30 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు శనీశ్వరుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 2025లో మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఏలినాటి శని దశ ప్రారంభం కానున్నదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఏలినాటి శని దశ నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు అన్ని విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది.

2025 సంవత్సరం మార్చి 29 శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇక్కడ దాదాపు రెండున్నర ఏళ్లు సంచరించనున్నాడు. దీంతో మేష రాశివారికి ఏలినాటి శని దశ మొదలవుతుంది. తీవ్ర ప్రభావంతో అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ ఏలినాటి శని మూడు దశల్లో ఉండనుంది. ఈ దశల్లో ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అతేకాడు ఈ సమయంలో విపరీతమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. కనుక మేషరాశి వారు తీసుకునే ప్రతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అదే సమయంలో శని ప్రభావం నుంచిబయటపడి ఏయే రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

మకర రాశి: ఈ రాశికి అధినేత శనీశ్వరుడు. శని పాలించే గ్రహం మకర రాశి వారికి శని మీన రాశిలోకి సంచారం చేయడంతో ఏలి నాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. శని చివరి దశలో ఉన్నాడు కనుక వీరికి త్వరలోనే మంచి రోజులు ప్రారంభం కానున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొత్త ఏడాదిలో మార్చి నెలల నుంచి వీరికి ఊహించని విజయాలు అందుకుంటారు. అంతేకాదు ఆర్థికంగా కూడా లాభపడతారు. చేపట్టిన పనులన్నీ సక్సెస్ గా పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వారికి శని సంచారంతో శుభప్రదంగా ఉంటుంది. శని అనుగ్రహంతో చేయాలనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతే కాదు ఈ రాశివారికి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడి నాలుగు విధాలుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు చేసే పనిలో, జీతంలో మెరుగుపడతారు. అంతేకాదు వీరికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారంలోని సమస్యల దూరం అయి వ్యాపారస్తుల పెట్టుబడులు లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు