Budha Gochar: సింహ రాశిలో బుధుడు సంచారం.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి..!

ఈ నెల 19 నుంచి ఆగస్టు 22 వరకూ బుధుడు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహ రాశి బుధ గ్రహానికి మిత్ర క్షేత్రం. బుధ, రవులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే కాక, బుధుడి స్థానంలో రవి, రవి స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు కూడా బుధాదిత్య యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయని జ్యోతషశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అనేక అంశాల్లో జీవితంలో ఒక మెట్టయినా పైకి ఎక్కడానికి ఇది దోహదం చేస్తుంది.

Budha Gochar: సింహ రాశిలో బుధుడు సంచారం.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి..!
Budh Gochar 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2024 | 11:02 AM

ఈ నెల 19 నుంచి ఆగస్టు 22 వరకూ బుధుడు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహ రాశి బుధ గ్రహానికి మిత్ర క్షేత్రం. బుధ, రవులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే కాక, బుధుడి స్థానంలో రవి, రవి స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు కూడా బుధాదిత్య యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయని జ్యోతషశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అనేక అంశాల్లో జీవితంలో ఒక మెట్టయినా పైకి ఎక్కడానికి ఇది దోహదం చేస్తుంది. సమస్యల పరిష్కారానికి, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావడానికి, అనేక విషయాల్లో ప్రతిష్ఠంభన తొలగిపోయి పురోగతి చెందడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. సింహ రాశి బుధుడి వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రానున్నాయి.

  1. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో రాజయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. సామాజికంగా హోదా, స్థితిగతులు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ధన సంపాదన జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలకు మార్గం సుగమం అవుతుంది.
  2. మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తృతీయ స్థానమైన సింహ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ప్రతిష్ఠంభన ఏర్పడినా తొలగిపోయి, ఆశించిన పురో గతి ప్రారంభం అవుతుంది. ధనాదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. విదేశీ ప్రయా ణాలకు అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది.
  3. సింహం: ధన, లాభాధిపతి బుధుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారికి ధనానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తూనే ఉంటుంది. రావలసిన డబ్బు తేలికగా చేతికి అందుతుంది. ప్రముఖులతో లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందు తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు లాభ స్థాన ప్రవేశం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు శీఘ్రగతిన పురోగతి చెందుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి దశమాధిపతి అయిన బుదుడు భాగ్య స్థాన సంచారం వల్ల విదేశీయానానికి, విదేశాల్లో సంపాదనకు బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం విదేశీ ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం ఉంటుంది. అనుకోకుండా పిత్రార్జితం సంక్రమిస్తుంది. తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి.
  6. కుంభం: ఈ రాశికి సప్తమంలో బుధ సంచారం వల్ల సాధారణ జీవితం సైతం సంపన్న జీవితంగా మారే అవ కాశం ఉంటుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి ఖాయం అవడం లేదా అటువంటి వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వృద్ధి చెందు తుంది. వ్యాపారాల్లో లేదా షేర్లలో మదుపు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..