AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Horoscope: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం

స్త్రీ గ్రహం చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశిలో స్త్రీ గ్రహమైన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల మహిళలకు నెల రోజుల కాలంలో అదృష్టం పండబోతోంది. సాధారణంగా శుక్రుడు మహిళలకు ఎక్కువగా ఏదో ఒక లాభం కలిగించడం, ఒక యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. శుక్రుడు స్త్రీ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు మహిళలకు ఏదో ఒక ఉపకారం చేయకుండా ఆ రాశి నుంచి నిష్క్రమించే అవకాశం ఉండదు.

Lucky Horoscope: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం
Shukra Gochar 2024
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 15, 2024 | 11:12 AM

Share

స్త్రీ గ్రహం చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశిలో స్త్రీ గ్రహమైన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల మహిళలకు నెల రోజుల కాలంలో అదృష్టం పండబోతోంది. సాధారణంగా శుక్రుడు మహిళలకు ఎక్కువగా ఏదో ఒక లాభం కలిగించడం, ఒక యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. శుక్రుడు స్త్రీ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు మహిళలకు ఏదో ఒక ఉపకారం చేయకుండా ఆ రాశి నుంచి నిష్క్రమించే అవకాశం ఉండదు. ఈసారి శుక్రుడి కర్కాటక రాశి సంచారం సందర్భంగా మేషం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశులకు చెందిన మహిళలకు ఆశించిన పురోభివృద్ధి లభించే అవకాశం ఉంది.

  1. మేషం: గట్టి పట్టుదల, తెగువ, చొరవలకు మారుపేరైన మేష రాశి మహిళలకు శుక్రుడి సంచారంతో పాటు గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి దేశ, విదేశీ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా అంది వస్తాయి. వారి కెరీర్ లో ఊహించని పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగం సంపా దించడం, పదోన్నతి లభించడం, వ్యాపారాలు ప్రారంభించడం, ఆదాయ వృద్ధి తదితర విషయాల్లో వీరు అనుకున్నవి సాధిస్తారు. వారిలోని నాయకత్వ లక్షణాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  2. మిథునం: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, అవకాశాలను అందుకోవడం, ఆచితూచి అడుగు వేయడం వంటి విషయాల్లో ముందుండే ఈ రాశి మహిళలకు వారి ఆశలు, అంచనాలకు తగ్గట్టుగా మంచి పురోగతి ఉంటుంది. తమ వరకూ వచ్చిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు, వృత్తి జీవితంలో కొత్త ప్రయోగాలతో విజయాలు సాధిస్తారు. ఆదాయ వృద్ధి విషయంలో వీరు కొత్త పుంతలు తొక్కుతారు.
  3. సింహం: దూర దృష్టి, జనాకర్షణ, నైపుణ్యాలు, ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే ఈ రాశి మహిళలు ఈ ఏడాదంతా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. రాశ్యధిపతి రవికి శుక్రుడు అను కూల స్థానంలో సంచారం చేయడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆదాయప రంగా కూడా మంచి అదృష్టాలు పడతాయి. ఎటువంటి ప్రాజెక్టునైనా విజయవంతంగా పూర్తి చేయ గలుగుతారు. ఎటువంటి లక్ష్యాన్నయినా సాధించగలుగుతారు. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి.
  4. కన్య: ఒక పద్ధతి ప్రకారం, వ్యూహం ప్రకారం వ్యవహరించే ఈ రాశి మహిళలు ఎంతో ముందు చూపుతో తమ నైపుణ్యాలకు, ప్రతిభకు పదను పెట్టుకునే అవకాశం ఉంది. వీరు పోటీ పరీక్షల్లోనే కాక, ఇంటర్వ్యూలలో సైతం ఘన విజయాలు సాధించి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్ని చేపట్టే అవకాశం కూడా ఉంది. కొత్త ఆదాయ మార్గాల్లో కూడా ఈ రాశి మహిళలు బాగా సఫలం అయ్యే సూచనలున్నాయి.
  5. తుల: శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు తమ శక్తియుక్తుల్ని పూర్తి స్థాయిలో పణంగా పెట్టి అందలాలు ఎక్కే అవకాశం ఉంది. వీరిలోని ప్రతిభ, నైపుణ్యాలు, సృజనాత్మక శక్తి, సానుకూల దృక్పథం వీరిని అదృష్టవంతుల్ని చేస్తాయి. తమకు ఏమాత్రం పరిచయం లేని, అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా వీరు తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు. వీరు పని చేసే చోట ఆదాయ వృద్ధి ఉంటుంది. అతి త్వరగా వీరు పదోన్నతులు సంపాదించే అవకాశం ఉంటుంది.
  6. ధనుస్సు: ధైర్యసాహసాలతోనూ, సానుకూల దృక్పథంతోనూ వ్యవహరించే ఈ రాశి మహిళలకు తప్పకుండా శుక్రుడి కర్కాటక రాశి సంచారం అదృష్టాలను తెచ్చిపెడుతుంది. వీరి జీవితం అనేక సానుకూల మలుపులు తిరుగుతుంది. వీరికి కొత్త అవకాశాలు అందివస్తాయి. తమ లక్ష్యాలను సాధించుకోవ డానికి వీరికి మార్గం సుగమం అవుతుంది. రిస్కు తీసుకోవడానికి సిద్ధపడే తత్వం కారణంగా వీరు అనేక విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఆదాయపరంగా వీరు కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..