Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 16, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూలై 16, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయ వ్యయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఒక చిన్నస్థాయి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచన లున్నాయి. ఎవరికీ ఎటువంటి హామీలూ ఉండ వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థుల సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభి స్తుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృ ప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దాంపత్య జీవి తంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ వాతావరణం కాస్తంత సమస్యాత్మకంగా ఉండ వచ్చు. వృత్తి, వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ప్రయాణాల్లో శ్రమాధిక్యత తప్ప ఫలితం ఉండదు. ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. మిత్రుల సహాయంతో కొన్ని తప్పనిసరి పనుల్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో ప్రశాంతతకు లోటుండదు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల చికాకులుంటాయి. మానసికంగా బాగా ఒత్తిడి ఉండవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మిత్రులతో స్వల్పంగా మాట పట్టింపులుంటాయి. వ్యత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో సర్దుకుపోవలసి వస్తుంది. ఉద్యోగు లకు స్థాన చలన సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యో గాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సరదాగా సాగి పోతుంది.
కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎటూ తేల్చుకోలేని పరి స్థితి ఏర్పడుతుంది. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సంతృప్తిని కలిగిస్తాయి. కొందరు స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. నిరుద్యోగులు కొద్దిగా ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో లోటు పాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఉన్నా అవి నెమ్మదిగా సర్దుకుంటాయి. కొందరు మిత్రులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు వృద్ది చెందుతాయి. నిరు ద్యోగులకు అనుకోకుండా కొన్ని మంచి ఆపర్లు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అప్రయత్నంగా పరిష్కారమై ఊరట చెందుతారు. కొత్త ప్రయత్నాలకు, నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక సహాయానికి కొందరు బంధు మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగు తాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కాకపోవచ్చు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమస్యలుంటాయి. సోదరులతో కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా అనుకూలతలు బాగానే ఉంటాయి. అయితే, ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయా సలు తప్పకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. వాహన ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం బాగానే ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.