Horoscope Today: వారు పై అధికారుల మెప్పు పొందుతారు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 15, 2024): మేష రాశి వారు ఈ రోజు అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. వృషభ రాశివారు ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జూలై 15, 2024): మేష రాశి వారు ఈ రోజు అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. వృషభ రాశివారు ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకోకుండా ఆదాయం పెరగడం, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. పెద్దల సహకారంతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగిపోతాయి. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత బాగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలకు ఆశించిన స్థాయి స్పందన లభించకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలో చించి ముందుకు సాగాలి. ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా మాత్రమే కలసి వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
చేపట్టిన పనుల్లో కొద్దిగా అవరోధాలున్నా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. అధిక శ్రమతో అల్ప లాభం పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి చాలావరకు పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన లాభాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. చేప ట్టిన పనులన్నిటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఒక విందులో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడు తుంది. వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలుంటాయి. వ్యాపారాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొద్దిపాటి లోటుపాట్లు ఉండే అవకాశం ఉంది. సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక ముఖ్య మైన వ్యక్తిగత సమస్యకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. ఆకస్మిక ధన వృద్ధి సూచనలున్నాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలకు ఆశించిన పెట్టుబడులు లభి స్తాయి. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఊహించని స్థాయిలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబంలో కొద్దిగా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యక్తిగత పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారా లన్నీ విజయవంతంగా అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రముఖులతో కలిసి సామాజిక సేవల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. రావలసిన సొమ్మును, మొండి బాకీలను సకాలంలో వసూలు చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమానికి హాజరవుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదు ర్కొనే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవ కా శం ఉంది. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్క బడతాయి. రావలసిన సొమ్ము అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొందరు బంధుమిత్రుల నుంచి ఊహించని సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తొలగిపో తాయి. ఉద్యోగంలో సహోద్యోగులకు వీలైనంత సహాయపడతారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగు తుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతు లకు బాగా అవకాశం ఉంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం నుంచి అనుకో కుండా బయటపడతారు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. చదువుల్లో పిల్లలకు అద నపు అవకాశాలు లభిస్తాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. కొత్త ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి కూడా అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.