Wealth Astrology: రాశ్యధిపతి అనుకూలత.. ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశి అధిపతి స్థానం జీవిత విజయానికి కీలకం. మేషం, వృషభం సహా మరికొన్ని రాశుల వారికి వారి రాశి అధిపతులు అనుకూల స్థానంలో ఉన్నారు. దీంతో వారి జీవితంలో ఆర్థిక ప్రగతి, ఉద్యోగ విజయం, సుఖ సంతోషాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తమ జీవితంలో అనేక మంచి విషయాలను అనుభవిస్తారు.

Telugu Astrology
Wealth & Career Astrology: రాశ్యధిపతి స్థితిగతులను బట్టే జీవితం ఆధారపడి ఉంటుందని, రాశ్యధిపతి అనుకూల స్థానంలో లేదా శుభ స్థానంలో ఉన్న పక్షంలో జాతక చక్రంలో ఎటువంటి దోషాలనైనా కొట్టుకుపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రాశినాథుడు అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జాతకంలో ఎటువంటి యోగాలు, అదృష్టాలున్నా ఫలించే అవకాశం ఉండదు. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకర రాశులకు రాశినాథుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశుల వారి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది.
- మేషం: రాశినాథుడు కుజుడు చతుర్థ స్థానంలో నీచను పొందినప్పటికీ, చతుర్థ కేంద్రమైనందు వల్ల నీచ భంగం కలిగింది. దీనివల్ల జూన్ 4 వరకు ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలగడం లేదా హోదా పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు అనేక మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛలో ఉండడంతో పాటు, మిత్ర గ్రహాలతో కలిసి ఉన్నందు వల్ల మే 31 వరకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో తప్ప కుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు మే 6 వరకు దశమ కేంద్రంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలతో పాటు, వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- కన్య: రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో శనీశ్వరుడు, ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల మే 6 వరకు జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో జూన్ 4 వరకూ సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు లాభాలు పండిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
- మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ ఏడాదంతా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.