Adhi Yoga: శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అధికార యోగం..!

Adhikara Yoga: శుభ గ్రహాలతో ఏర్పడే అధియోగం వల్ల నీతి, నిజయతీలతో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీని వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గానీ, ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Adhi Yoga: శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అధికార యోగం..!
Adhi Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 06, 2024 | 6:28 PM

సొంత రాశికి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో గురు, బుధ, శుక్రుల్లో ఎవరైనా సంచారం చేస్తున్నప్పుడు శుభాధియోగం ఏర్పడుతుంది. అధి యోగమంటే అధికార యోగమే. ఈ విధంగా తమ రాశికి 6, 7, 8 రాశుల్లో శుభ గ్రహాల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గానీ, ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి కూడా అవకాశం కలుగుతుంది. శుభ గ్రహాలతో ఏర్పడే అధియోగం వల్ల నీతి, నిజయతీలతో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, ధనూ రాశులకు ఈ శుభాధియోగం ఏర్పడింది. డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ యోగం వర్తిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశికి శుభాధియోగం కలిగింది. దీనివల్ల ప్రధానంగా సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవా లకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వివాదాల్లో విజయవంతంగా మధ్య వర్తిత్వం నెరపుతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.
  2. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి శుభాధి యోగం ఏర్పడింది. ఉన్నత కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహా రాల్లో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించడం, విస్తరించడం, లాభాలు అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో నాయకత్వ స్థానం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల కోవలో చేరిపోతారు.
  3. మిథునం: ఈ రాశికి షష్ట స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల శుభాధి యోగం ఏర్పడింది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు సంబం ధించి ఉన్నత వర్గాలతో సంబంధాలు ఏర్పడతాయి. సరికొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యో గంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం, ప్రేమలో పడడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల శుభాధియోగం కలిగింది. దీనివల్ల ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలు బాగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో అత్యంత శుభ గ్రహమైన గురువు సంచారం వల్ల ఈ రాశికి తిరుగులేని శుభాధియోగం ఏర్పడింది. దీనివల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్ప డతాయి. రావలసిన డబ్బు వసూలవుతుంది. జీతభత్యాలకు సంబంధించిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.
  7. ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువే సంచారం చేస్తున్నందువల్ల ఊహించని ఆర్థికాభి వృద్ధి కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమ స్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సమాజంలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా చెలామణీ అవుతారు. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి