Shukra Gochar: శుభకార్యాలకు శుక్రుడు గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి శుభ యోగాలు పక్కా..!

Venus Transit 2024: శుభ యోగాలను అందించే శుక్ర గ్రహం ఈ నెల 7వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ధనూ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ధనూ రాశి శుభ గ్రహమైన గురువుకు స్వక్షేత్రం అయినందువల్ల శుక్రుడు తప్పకుండా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది.

Shukra Gochar: శుభకార్యాలకు శుక్రుడు గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి శుభ యోగాలు పక్కా..!
Shubh Yogas
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 04, 2024 | 1:26 PM

శుభ యోగాలను అందించే గ్రహం శుక్రుడు.  శుక్ర గ్రహం ఈ నెల 7వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ధనూ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ధనూ రాశి శుభ గ్రహమైన గురువుకు స్వక్షేత్రం అయినందువల్ల శుక్రుడు తప్పకుండా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి తప్పకుండా ధన, వివాహ, సంతాన యోగాలు కలిగే అవకాశం ఉంది. శుక్రుడు ధనూ రాశి సంచారం వల్ల ఈ రాశులవారికి కుటుంబంలోనూ, వ్యక్తిగతంగానూ ఏదో ఒక శుభ యోగం పట్టకుండా ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

  1. మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదు రుతుంది. సంపన్న కుటుంబంతో ప్రేమలో పడడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగు లకు, నిరుద్యోగులకు ఇతర దేశాల ఆఫర్లు లభిస్తాయి. విలువైన ఆస్తులు వారసత్వంగా లభించే అవకాశముంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  2. మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. భోగభాగ్యాలకు లోటుండదు. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు కూడా అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  3. సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. జీవనశైలి బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూల సమయం.
  4. కన్య: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల దిగ్బల యోగం కూడా పట్టింది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆశించిన పురోగతి ఉంటుంది. గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెలకొంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
  7. కుంభం: ఈ రాశికి లాభ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరి చయాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. భాగ్యవంతుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి