Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఏంటి.?

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించడం అవసరం. కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తు తాయి.

Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే.. మరి మీ రాశి ఏంటి.?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2024 | 6:28 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా జాప్యం ఉన్నప్పటికీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అను కూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. పెద్ద ఎత్తున వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. కొందరు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అవసర విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరు అందరికీ సంతృప్తి కలిగిస్తుంది. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి అనా రోగ్య సమస్యలు ఉండవచ్చు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులన్నిటిలో వ్యయ ప్రయాసలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. గౌరవ మర్యాదలు, ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా, సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రాధాన్యమిస్తారు. అన్ని వైపుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ప్రారంభించిన పనులు, వ్యవహా రాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవ చింతన కలుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా పురోగమిస్తుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కార మవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన కష్టనష్టాలు చాలావరకు తగ్గుతాయి. ఉద్యో గంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. కీలక వ్యవహారాల్లో ఊహించని విజ యాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ల వల సిన అవసరం ఏర్పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ధనాదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణ యాలు తీసుకుని లబ్ధి పొందుతారు. పిల్లల చదువుల విషయంలో మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవ సరం ఉంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందే సూచనలున్నాయి. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిల్లలు విజయాలు సాధి స్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బాగా అనుకూల, సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించడం అవసరం. కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తు తాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండ డం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. సొంతగా ఇల్లు కొనుక్కోవడం మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగు తుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో కీలక బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సామరస్యం వృద్ధి చెందుతుంది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?