Monthly Horoscope: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి నవంబరు మాస ఫలాలు

మాస ఫలాలు (నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2024 వరకు): మేష రాశి వారు ఈ నెల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి నవంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 31, 2024 | 9:19 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా విజయాలకు, సాఫల్యాలకు లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.  విద్యార్థులు తప్పకుండా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఈ నెలంతా వినాయకుడిని పూజించడం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశం ఉంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు, రాహువు, బుధ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్య మైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. కొద్దిపాటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగ డంతో పాటు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గానీ పూర్తయ్యే అవకాశం లేదు. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుక్ర, రవి, కుజ గ్రహాల అనుగ్రహం వల్ల నెలంతా సానుకూలంగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను అధిగమిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. పని చేస్తున్న సంస్థకు ఈ రాశివారి మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరు ద్యోగులకు ఆశించిన సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.  ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల మనసులోకి కోరికలు నెరవేరుతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, బుధ, రవి,, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా ఆశించిన విధంగా జీవితం గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా, ఆశాజనకంగా సాగి పోతాయి. వ్యాపా రాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరి ష్కారం అవుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కానీ కుటుంబ ఖర్చులు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రులతో సమ స్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం ఆదాయానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): శుభ గ్రహాల అనుకూలత బాగానే ఉంది. ఆదాయం బాగా వృద్ధి  చెందే అవకాశాలున్నాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు, బాకీలను వసూలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగంతో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలవరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది.  బంధుమిత్రుల వాద వివాదాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి చోటు చేసుకుంటుంది. తరచూ శివార్చన చేయించడం మంచిది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  ఇష్టమైన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు క్రమంగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.  ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ప్రతి రోజూ ఉదయం విష్ణు సహస్రనామం పఠించడం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుక్ర, బుధ, శనుల అనుకూల సంచారం కారణంగా ఎక్కువగా ధన సంపాదన మీద దృష్టి కేంద్రీ కరిస్తారు. ఎటువంటి ఆదాయ ప్రయత్నం చేపట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తితో లేదా తెలిసిన కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అను కూలతలు పెరుగుతాయి. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. ప్రతి రోజూ ఉదయం లలితా సహస్ర నామం చదువుకోవడం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గ్రహాల అనుకూలత పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు అను భవానికి వస్తాయి. గురు, శుక్రుల పరివర్తన వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అనేక సాను కూలతలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థికంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు కోరు కున్న సంస్థలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండక పోవచ్చు. సోదరులతో, కొందరు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.  ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రతి రోజూ సుందరకాండ పారాయణం వల్ల అనుకూలతలు పెరుగుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుక్ర, శని, కుజ గ్రహాల అనుకూల సంచారం వల్ల నెలంతా ఆశాజనకంగా, సంతృప్తికరంగా సాగి పోతుంది. ఆదాయపరంగా మెరుగైన స్థితిలో ఉంటారు. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగులు జీతభత్యాలు ఎక్కు వగా ఇచ్చే సం‍స్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా మంచి అవకాశాలు అందే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఈ రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి కారణంగా ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనారో గ్యాలకు అవకాశం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, గురు, బుధ, రవి గ్రహాల వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ధన, లాభ స్థానాల బలం వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందు తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత పదవులకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలి తాలనిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు శ్రమను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. తరచూ స్కంద స్తోత్ర పఠనం చాలా  మంచిది.

10 / 12

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ  రాశివారికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధ, రవి గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది. ముఖ్యమైన సమస్యలు, అవస రాలు తీరిపోతాయి. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవ హారాలు అనుకూలంగా మారడం వల్ల ధనపరంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఇతరుల వివాదాల్లో తల దూర్చకపోవడం మంచిది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థు లకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తరచూ సుబ్ర హ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుక్ర, బుధ, రవుల అనుకూలత వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నిటినీ పూర్తి చేసి ఊరట చెందుతారు. కొందరు సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశిం చిన స్పందనలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యో గాలు సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.  ఆస్తి పాస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగి పోతాయి. పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు చదువుల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తరచూ శివార్చన చేయడం మంచిది.

12 / 12
Follow us