Parivartan Yoga: శుభ గ్రహాల పరివర్తన.. వారికి కలలో కూడా ఊహించని శుభ యోగాలు..!

నవంబర్ మాసంలో శుభ గ్రహాలైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం పెద్ద విశేషం. ఈ పరి వర్తన నవంబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకూ కొనసాగుతుంది. గురువుకు చెందిన ధనూ రాశిలో శుక్రుడి ప్రవేశం, శుక్రుడికి చెందిన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. శుభ గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి.

Parivartan Yoga: శుభ గ్రహాల పరివర్తన.. వారికి కలలో కూడా ఊహించని శుభ యోగాలు..!
Parivartan YogaImage Credit source: Getty Images
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 30, 2024 | 12:44 PM

నవంబర్ మాసంలో శుభ గ్రహాలైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం పెద్ద విశేషం. ఈ పరి వర్తన నవంబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకూ కొనసాగుతుంది. గురువుకు చెందిన ధనూ రాశిలో శుక్రుడి ప్రవేశం, శుక్రుడికి చెందిన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. శుభ గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, శుభకార్యాలు నిర్వహించడం, శుభవార్తలు వినడం వంటివి చోటు చేసుకుం టాయి. ప్రస్తుత పరివర్తన వల్ల మేషం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశులకు కలలో కూడా ఊహించని శుభ యోగాలు పట్టబోతున్నాయి.

  1. మేషం: ఈ రాశివారికి ధన, భాగ్య స్థానాల మధ్య పరివర్తన జరిగినందువల్ల అపారమైన ధన లాభం కలు గుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవ కాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమై అనుకూలతలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది.
  2. సింహం: ఈ రాశికి పంచమ, దశమ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. ప్రతిభ, సమర్థత వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  3. కన్య: ఈ రాశివారికి చతుర్థ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. తప్పకుండా వాహన యోగం పడుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన యోగాలు పడతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి ధన, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. కుటుంబ, దాంపత్య సమస్యలు తొలగిపోయి, అనుకూలతలు పెరుగు తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం అయి, విలువైన ఆస్తి చేజిక్కుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవిత భాగస్వామికి కూడా ధన యోగాలు పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ, లాభ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తుల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. పొలాలు, స్థలాలు కొనే అవకాశం ఉంది. సొంత ఇల్లు అమరడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరుగుతాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు చేసే సూచన లున్నాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.
  7. మీనం: తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువుతో భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడికి పరివర్తన జరిగి నందువల్ల నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం పొందు తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో కలలో కూడా ఊహించని శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సమస్యలు, నష్టాల నుంచి బయటపడతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు