November Horoscope: కీలక గ్రహాల ప్రభావం.. నవంబర్ నెలలో ఆ రాశుల వారికి మహర్దశ

నవంబర్ మాసంలో శుక్ర, రవులు రాశులు మారడంతో పాటు, శనీశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టి రుజువర్తన ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గురు, శుక్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతుంది. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవి తాల్లో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

November Horoscope: కీలక గ్రహాల ప్రభావం.. నవంబర్ నెలలో ఆ రాశుల వారికి మహర్దశ
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 30, 2024 | 11:03 AM

నవంబర్ మాసంలో శుక్ర, రవులు రాశులు మారడంతో పాటు, శనీశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టి రుజువర్తన ప్రారంభించడం జరుగుతుంది. పైగా గురు, శుక్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతుంది. ఈ మార్పుల వల్ల మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారి జీవి తాల్లో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. శుభవార్తలు, సానుకూల వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. మిగిలిన రాశులకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. యథాతథ స్థితి కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి నవంబర్ నెలంతా శుభ పరిణామాలు, శుభవార్తలతో సాగిపోతుంది. ఆశించిన మంచి ఉద్యోగంలోకి మారడానికి, కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు సంబంధించి ఆశించిన సానుకూల సమాచారం అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశీయానానికి అనుకూలతలు పెరుగుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ఈ నెలంతా అష్టమ శని ప్రభావం బాగా తగ్గి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం, అదనపు బాధ్యతలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశివారికి అనేక విధాలుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ, సమర్థతలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో పాటు కొత్త మార్పులు చేపట్టి లాభాలు పొందు తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. అనేక మార్గాలు ఆదా యాన్ని పెంచుకుంటారు. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి.
  4. కన్య: ఈ రాశివారికి ఈ నెలంతా సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పిత్రా ర్జితం లభించే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులతో వివాదాలు సమసిపోతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. ఈ నెలలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కావడం గానీ జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఇష్టమైన ప్రాంతాలను, పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.
  7. కుంభం: ఈ రాశికి శుభ గ్రహాల అనుకూలత వల్ల ఏలిన్నాటి శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా దాదాపు విముక్తి లభిస్తుంది. ఉద్యోగపరంగా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభించే అవకాశం ఉంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?