Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (October 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశముంది. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 30th October 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 30, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం ఉంటుంది. వ్యాపారంలో యాక్టివిటీ పెరిగి బాగా బిజీ అవు తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొన్ని మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. రాద నుకున్న డబ్బు చేతికి అందు తుంది. తలపెట్టిన పనులు చురుకుగా పూర్తవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఒకరిద్దరు చిన్న నాటి మిత్రుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు కుద ర్చుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొందరు సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లాభం పొందుతారు. సోదరులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొద్దిగా పురోగతి సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలను మార్చడం వల్ల ఊరట చెందుతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయ మార్గాలు కొద్దిగా విస్తరించే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టిం పులు తప్పకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి తక్కువవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగు తాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదా యం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. చాలా కాలంగా మానసిక ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ విషయాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలంగా నెరవేరుతాయి. అనుకున్న పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని కీలకమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా దూసుకుపోతారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సోదరులతో స్థిరాస్తి వివాదాలు, ఇతర సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఆశాజనక వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తొలగి పోతుంది. ఉద్యోగాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాల వల్ల ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుని మరింత పురోగతి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అధికారుల ఆదరణ, ప్రోత్సాహాలతో ఉద్యోగులకు అనేక లాభాలు కలుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

నిరుద్యోగుల కలలు నెరవేరుతాయి. కొందరు దగ్గర బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సా హంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. చేపట్టిన పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తయి ఊరట లభిస్తుంది. షేర్లు, స్పెక్యులే షన్లు వృద్ధి చెందడానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి కని పిస్తుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.

హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్