Bhagya Yoga: రాశి పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి భారీగా పెరగనున్న ఆదాయం..!
వచ్చే నెల (నవంబర్) 3,4,5 తేదీల్లో కుజ, చంద్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన చోటు చేసుకుంటోంది. అంటే కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో చంద్రుడు.. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. రాశి పరివర్తన కారణంగా చంద్ర మంగళ యోగమనే భాగ్య యోగం ఏర్పడుతుంది.
Rashi Parivartan Yoga: నవంబర్ 3,4,5 తేదీల్లో కుజ, చంద్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన చోటు చేసుకుంటోంది. కుజుడి వృశ్చిక రాశిలో చంద్రుడు, చంద్రుడి కర్కాటక రాశిలో కుజుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. సాధారణంగా కుజు, చంద్రులు యుతి చెందినా, ఒకరినొకరు చూసుకున్నా, వాటి మధ్య పరివర్తన జరిగినా చంద్ర మంగళ యోగమనే భాగ్య యోగం ఏర్పడుతుంది. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం కూడా ఈ యోగంలో భాగమవుతాయి. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ పరివర్తన యోగం వల్ల ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది.
- వృషభం: ఈ రాశికి తృతీయ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభ వార్తలు వింటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడితో కుజుడికి పరివర్తన జరగడం వల్ల పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ప్రతిభ, నైపుణ్యాలు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. ఆస్తి పాస్తులు సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందు తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- తుల: ఈ రాశికి ధన, దశమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందు వల్ల ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిత్రార్జితం లభించడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా కలుగుతుంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి భాగ్యాధిపతి చంద్రుడితో పరివర్తన కలగడం వల్ల మహా భాగ్య యోగం పడు తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రభుత్వమూలక ధన లాభం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి భారీగా సంపాదించడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి భూలాభం కలుగుతుంది. కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధించడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకుంటున్నందువల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కూడా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
- మీనం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదేశీమూలక ధన లాభం కలుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి