Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (అక్టోబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. వృషభ రాశి వారు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఇష్టమైన మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగుతాయి. బంధువర్గానికి సహాయంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వ్యాపారాల పురోగతికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కుటుంబ పరిస్థితులను ఒక దారికి తీసుకు వస్తారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరి ష్కరించుకునే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. విస్తరణ కార్యక్రమాల్ని కూడా చేపడతారు. వృత్తి, ఉద్యోగాల వాతా వరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చాలావరకు పూర్తవు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ప్రయాణాల వల్ల బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. స్వల్ప అనారోగ్య సమ స్యలు బాధిస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇత రుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కారంలో పెద్దల సహా యం లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగంలో అధికారులకు సన్నిహితమవుతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రావలసిన సొమ్మును సకాలంలో వసూలు చేసుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు, వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభా లందుకుంటారు. ఉద్యోగుల పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన రుణ సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగుల శ్రమకు సరైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ద చేయడం మంచిది కాదు. వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవ కాశాలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమాజంలో కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. చేపట్టిన పనులు, వ్యవ హారాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. వృత్తి, వ్యాపా రాల్లో అంచనాల్ని అందుకుంటారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి పెడతారు. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆస్తి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫ లమవుతాయి. రాదనుకున్న డబ్బు అనుకోకుండా వసూలవుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన పనులు, పెండింగ్ వ్యవహారాలను పూర్తి చేయడానికి బాగా శ్రమపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులున్నా లాభాలు కలుగుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రద్ద పెరుగుతుంది. కుటుంబ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగు తాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగి ఇబ్బంది పడతారు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. సన్నిహితులకు సహాయ సహకారాలు అందజేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.