AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

Multibagger Stock: ఈ స్టాక్ 5 సంవత్సరాలలో 14 పైసల నుండి రూ. 35 కి ఎగబాకి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. ఈ స్టాక్‌ పెట్టుబడిదారుల అదృష్టాన్ని మార్చేసింది. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఏకంగా 2 కోట్లకుపైగా లాభాలను తెచ్చి పెట్టింది. ఈ స్టాక్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!
Multibagger Stock
Subhash Goud
|

Updated on: Apr 27, 2026 | 11:37 AM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు అదృష్టం ఎలా వరిస్తుందో చెప్పడానికి ఈ స్టాక్ ఒక నిదర్శనం. పెన్నీ స్టాక్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఐదేళ్ల కాలంలో కళ్లు చెదిరే లాభాలను పంచిన కంపెనీ – నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Nurture Well Industries Ltd).

ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!

కళ్లు చెదిరే రిటర్న్స్:

ఐదేళ్ల క్రితం ఈ షేర్ ధర కేవలం 14 పైసలు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ స్టాక్ 35 రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ షేర్ ఏకంగా 24,970% కంటే ఎక్కువ రిటర్న్స్‌ను అందించింది. ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు దాని విలువ దాదాపు రూ. 2.50 కోట్లు అయ్యేది.

ఇవి కూడా చదవండి

షేర్ పర్ఫార్మెన్స్:

నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం రూ. 35 సమీపంలో ట్రేడవుతోంది. 52 వారాల గరిష్టం: ఫిబ్రవరి 17, 2026న ఈ షేర్ రూ. 46 వద్ద తన 52 వారాల గరిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ 2025లో ఈ షేర్ రూ. 17 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

స్టాక్ స్ప్లిట్, బోనస్: 2024 సంవత్సరంలో ఈ కంపెనీ ఒక షేరును 10 ముక్కలుగా విభజించడంతో పాటు (Stock Split), ప్రతి ఒక షేరుకు ఒక బోనస్ షేరును (Bonus Issue) కూడా ప్రకటించింది.

షేర్ హోల్డింగ్ లో మార్పులు:

FY26 మార్చి త్రైమాసిక నివేదిక ప్రకారం: 53.81 శాతం వాటాతో ప్రమోటర్లు స్థిరంగా ఉన్నారు. FIIs (విదేశీ ఇన్వెస్టర్లు): వీరి వాటా 4.25% నుండి 0.18% కి పడిపోయింది.

పబ్లిక్ షేర్ హోల్డింగ్: సామాన్య ఇన్వెస్టర్ల వాటా 41.86% నుండి 45.94% కి పెరిగింది. ఇది కంపెనీపై రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సూచిస్తుంది.

యాజమాన్యంలో మార్పులు:

కంపెనీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో శీతల్ సోనీని కొత్త CFOగా నియమించారు. ఏప్రిల్ 21, 2026 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది.

త్రైమాసిక ఫలితాలు:

FY26 డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 290 కోట్లుగా నమోదైంది. నికర లాభం రూ. 31 కోట్లుగా ఉండగా, ప్రతి షేరుపై ఆదాయం (EPS) 1.06 రూపాయలకు పెరిగింది.

ఇది కూడా చదవండి: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.6000.. రైతుల కోసం దరఖాస్తులు షురూ.. ఇలా చేసుకోండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎస్‌బీఐలో కేవలం రూ.1 లక్ష డిపాజిట్‌ చాలు రూ.42,524 వడ్డీ..
ఎస్‌బీఐలో కేవలం రూ.1 లక్ష డిపాజిట్‌ చాలు రూ.42,524 వడ్డీ..
కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా..
కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా..
నవజాత శిశువులకు మసాజ్ చేయడం తప్పనిసరా?
నవజాత శిశువులకు మసాజ్ చేయడం తప్పనిసరా?
ఎండల్లో బెస్ట్ స్వీట్ ఇదే.. శరీరాన్ని కూల్ చేసే సత్తు లడ్డులు..
ఎండల్లో బెస్ట్ స్వీట్ ఇదే.. శరీరాన్ని కూల్ చేసే సత్తు లడ్డులు..
మీ కళ్లద్దాలపై గీతలు పడుతున్నాయా? లెన్స్‌లను క్లీన్ చేసే సరైన పద
మీ కళ్లద్దాలపై గీతలు పడుతున్నాయా? లెన్స్‌లను క్లీన్ చేసే సరైన పద
హీట్ నుంచి ఎస్కేప్ కావాలా? ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రెక్కింగ్..
హీట్ నుంచి ఎస్కేప్ కావాలా? ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రెక్కింగ్..
వంటగదిలో బేకింగ్ సోడాతో మ్యాజిక్.. గంటల పనిని నిమిషాల్లో ముగించే
వంటగదిలో బేకింగ్ సోడాతో మ్యాజిక్.. గంటల పనిని నిమిషాల్లో ముగించే
90s కిడ్స్ ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు.. ఇంట్లో ఇలా చేస్తే
90s కిడ్స్ ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు.. ఇంట్లో ఇలా చేస్తే
అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా
అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా
తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్తే మండే ఎండలో కూడా ఎండిపోదు..
తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్తే మండే ఎండలో కూడా ఎండిపోదు..