IPL 2026 : రెండు మ్యాచ్‌లు.. బోలెడు మార్పులు.. ఐపీఎల్ 2026లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వీరులు వీళ్లే
IPL 2026 : బ్యాటర్ల ఆధిపత్యం ఒకవైపు, బౌలర్ల పంజా మరోవైపు ఐపీఎల్ పాయింట్ల పట్టికతో పాటు వ్యక్తిగత రికార్డులను కూడా షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షాక్ ఇవ్వగా, బౌలింగ్‌లో సరికొత్త కుర్రాడు అన్షుల్ కంబోజ్ సంచలనం సృష్టిస్తున్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం జరిగిన రెండు కీలక పోరాటాల తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసులో ఈక్వెషన్స్ పూర్తిగా మారిపోయాయి. బ్యాటర్ల ఆధిపత్యం ఒకవైపు, బౌలర్ల పంజా మరోవైపు ఐపీఎల్ పాయింట్ల పట్టికతో పాటు వ్యక్తిగత రికార్డులను కూడా షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షాక్ ఇవ్వగా, బౌలింగ్‌లో సరికొత్త కుర్రాడు అన్షుల్ కంబోజ్ సంచలనం సృష్టిస్తున్నాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులోకి గిల్
ఆదివారం జరిగిన గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ల తర్వాత బ్యాటర్ల జాబితాలో మార్పులు వచ్చాయి. సన్‌రైజర్స్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ 380 పరుగులతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, రెండో స్థానంలో కెఎల్ రాహుల్ (357), మూడో స్థానంలో వైభవ్ సూర్యవంశీ (357) గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే నాలుగో స్థానంలో క్లాసెన్ ఉండగా.. ఐదో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని కిందికి నెట్టి శుభ్‌మన్ గిల్ (330 రన్స్) టాప్ 5 లోకి ప్రవేశించాడు. కోహ్లీ ప్రస్తుతం ఈ జాబితా నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
పర్పుల్ క్యాప్ రేసులో చెన్నై పేసర్ సెన్సేషన్
బౌలింగ్ విభాగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ అన్షుల్ కంబోజ్ ఇప్పటివరకు 14 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ఇషాన్ మలింగ (14 వికెట్లు) రికార్డును కంబోజ్ తన మెరుగైన ఎకానమీతో అధిగమించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. వీరి వెంటే జోఫ్రా ఆర్చర్, ప్రిన్స్ యాదవ్, కగిసో రబాడ తలో 13 వికెట్లతో టాప్ 5లో కొనసాగుతున్నారు. వికెట్ల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో ప్రతి మ్యాచ్ పర్పుల్ క్యాప్ రేసును మలుపు తిప్పుతోంది.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఈ సీజన్ లో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 357 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండటం అతని టాలెంటుకు నిదర్శనం. కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ వంటి సీనియర్లకు ఈ కుర్రాడు గట్టి సవాల్ విసురుతున్నాడు. లక్నోపై కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్, ఇప్పుడు టీమిండియా సెలెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు.
నేటి మ్యాచ్‌పై ఉత్కంఠ
ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ముఖ్యం. ఒకవేళ కోహ్లీ నేటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తే, అతను ఏకంగా ఆరెంజ్ క్యాప్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, బెంగళూరు బౌలర్లు ఎవరైనా విజృంభిస్తే పర్పుల్ క్యాప్ రేసులో కూడా మార్పులు సంభవించవచ్చు. పాయింట్ల పట్టికలో వెనుకబడిన జట్లకు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
