ఆలూ... పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?
27 April 2026
TV9 Telugu
TV9 Telugu
ఇంటికి హఠాత్తుగా బంధువులొస్తే చికెన్ లోటును భర్తీ చేసేది ముమ్మటికీ బంగాళా దుంపలే. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వీటిని నిల్వ చేసుకుంటూ ఉంటారు
TV9 Telugu
అయితే బంగాళాదుంపల నిల్వకు సంబంధించి తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది. వీటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేయడమో లేదా ప్లాస్టిక్ సంచుల్లో ఉంచడమో చేస్తుంటాం. ఫలితంగా ఇవి త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది
TV9 Telugu
ఫ్రిజ్‌లో వీటిని స్టోర్ చేస్తే... దుంపల్లోని స్టార్చ్ షుగర్‌గా రూపాంతరం చెందుతుంది. ఫలితంగా ఉడికించినప్పుడు ఇవి తియ్యగా మారిపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదంటున్నారు నిపుణులు
TV9 Telugu
అలాగే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే, ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లోనూ వీటిని నిల్వ చేయకూడదు. వీలైనంతవరకు బాగా గాలి ప్రసరించే, చల్లని చీకటి ప్రదేశాల్లోనే స్టోర్ చేయాలట
TV9 Telugu
రంధ్రాలున్న బ్యాగులు, పేపర్ సంచుల్లో వీటిని నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. నిల్వ చేసేముందు బంగాళాదుంపలను నీటితో కడగకూడదు. దీనివల్ల త్వరగా పాడైపోయే అవకాశముందట
TV9 Telugu
బంగాళాదుంపలను సరిగా స్టోర్ చేయకపోతే వాటి ఉపరితలం ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఈ క్రమంలో ఉత్పత్తయ్యే రసాయనాల వల్ల ఇవి రుచిని, తాజాదనాన్ని కోల్పోయి చేదుగా మారతాయి
TV9 Telugu
వీటిని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు బంగాళాదుంపల మీద మొలకలు వస్తుంటాయి. వండేటప్పుడు వీటిని తొలగించుకోవాలి
TV9 Telugu
చల్లగా ఉండే చీకటి ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల మొలకలు రాకుండా జాగ్రత్తపడచ్చు. మార్కెట్ నుంచి కొత్తగా తెచ్చిన దుంపలను పాత వాటితో కలపకూడదు. అలాగే పాడైన దుంపలను ఎప్పటికప్పుడు వేరు చేయాలి. లేకపోతే మిగతావి కూడా కుళ్లిపోతాయట