ప్రేమానంద్ జీ మహారాజ్: మీ జీవితాన్నే మార్చే అద్బుతమైన చిట్కాలు ఇవే !

samatha

27 April 2026

జీవితంలో ప్రతి వ్యక్తి ఆనందాన్ని కోరుకుంటాడు. కానీ నిజానికి చాలా తక్కువ మంది మాత్రమే నిజమైన, ఆనందాన్ని పొందుతుంటారు.

ఆనందం

ప్రేమానంద్ జీ బోధనలు మనసుకు సంతోషాన్ని ఇచ్చేలా ఉంటాయి. అయితే ఆయన ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా తెలియజేశాడు.

ప్రేమానంద్ జీ

అదే విధంగా ప్రేమానంద్ జీ, మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని, సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేయడం జరిగింది.

ప్రశాంతమైన జీవితం

ఎలాంటి ఒత్తిడి, టెన్షన్స్ లేకుండా ఆనందంగా గడపాలి అంటే ముఖ్యంగా సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది.

సంతృప్తి

అలాగే మనసులోని ఆలోచనలే మన జీవితాలను తీర్చి దిద్దుతాయి. అందువలన ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి.

సానుకూల ఆలోచనలు

కొంత మంది అహంకారం చూపిస్తూ, బంధాలను దూరం చేసుకుంటారు. అందువలన అహంకారాన్ని వీడినప్పుడే ఆనందంగా ఉంటారు.

అహంకారం వదలడం

అదే విధంగా బంధు మిత్రులతో ఆనందంగా కలిసి ఉండటం. ఏదో ద్వేశంతో నిండి ఉండటం కాకుండా, అందరితో కలిసిపోవాలి. అప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది.

ద్వేశం వదలడం

కొందరు సంపద మాయలో పడిపోయి, బంధాలను, బంధుత్వాలను మర్చిపోతారు. కానీ డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు అని గుర్తించుకోవాలి.

సంపదే శాశ్వతం కాదు