AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!

ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!
LPG Gas Rules
Subhash Goud
|

Updated on: Apr 27, 2026 | 12:05 PM

Share

Gas Cylinder New Rules: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిలో సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ విషయంలో భారతదేశంలో భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఎల్పీజీ లభ్యత ప్రభావితం కావచ్చు. అందుకోసం దేశంలోని మూడు ప్రధాన చమురు కంపెనీలు – ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ – సిలిండర్ బుకింగ్ నిబంధనలను మార్చడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు 2026 మే 1 నుంచి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు.

ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ధరల పెంపుతో పాటు, ప్రభుత్వం గ్యాస్ వినియోగానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం:

ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!

ఇవి కూడా చదవండి

1. కొత్త గ్యాస్ కనెక్షన్లపై తాత్కాలిక నిషేధం

దేశంలో కొత్త ఎల్‌పిజి కనెక్షన్ల జారీపై ప్రభుత్వం తాత్కాలికంగా స్టే విధించింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడమే ప్రధాన లక్ష్యమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల కనీసం ఒక నెల రోజుల పాటు ఎవరికీ కొత్త కనెక్షన్లు లభించే అవకాశం లేదు.

2. బుకింగ్ నిబంధనల్లో మార్పులు

గ్యాస్ బుకింగ్ మధ్య ఉండాల్సిన విరామం (Gap) పై ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో: రెండు రీఫిల్స్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లో: ఈ గ్యాప్ 45 రోజులుగా ఉండాలి. ఈ నిబంధనను శాశ్వతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే, మీకు నచ్చినప్పుడు వెంటనే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఇకపై ఉండకపోవచ్చు.

3. OTP ఆధారిత డెలివరీ తప్పనిసరి

భద్రత, పారదర్శకత కోసం OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) విధానాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే కోడ్ చెబితేనే సిలిండర్ డెలివరీ చేస్తారు. దీనివల్ల నకిలీ బుకింగ్‌లకు అడ్డుకట్ట పడనుంది.

4. బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా

దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో హోటళ్లు, వ్యాపార సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు డొమెస్టిక్ (ఇంటి) సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారు. దీనిపై అధికారులు దాడులు నిర్వహిస్తూ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిపుణుల సలహా:

గ్యాస్ సిలిండర్ల నిరీక్షణ, పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం పొందేందుకు వినియోగదారులు పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద కుటుంబాలకు 25 రోజుల నిరీక్షణ సమయం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించడం ప్రస్తుతం తప్పనిసరి.

ఇది కూడా చదవండి: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

ఇది కూడా చదవండి: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.6000.. రైతుల కోసం దరఖాస్తులు షురూ.. ఇలా చేసుకోండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us