ఉదయం నిద్రలేచిన తర్వాత కప్పు వేడి వేడి కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అయితే కాఫీ విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే కాఫీ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని రెండు వారాల పాటు నియమితంగా తీసుకుంటే శరీరంపై పలు సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు
TV9 Telugu
కాఫీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నియమితంగా కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. దీని వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే కాఫీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది
TV9 Telugu
ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును ఉత్తేజపరుస్తుంది
TV9 Telugu
కాఫీలోని కెఫీన్ అలర్ట్‌నెస్, దృష్టి, మానసిక పనితీరును పెంచి మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కాఫీ సహాయపడుతుంది
TV9 Telugu
ఇది పెద్దపేగును ఉత్తేజపరచి గట్ మొటిలిటీని పెంచడం ద్వారా జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే కాఫీని ఎల్లప్పుడు పరిమితంగానే తీసుకోవాలి
TV9 Telugu
ముఖ్యంగా IBS లాంటి సమస్యలు ఉన్నవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పెద్దలకు రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుంది. గుండె దడ, ఆందోళన, ఆమ్లత్వం లేదా నిద్ర సమస్యలు ఉంటే కాఫీని మానేయడం మంచిది
TV9 Telugu
కాఫీలో అధికంగా చక్కెర లేదా ప్రాసెస్ చేసిన క్రీమ్‌లను కలపడం ఆరోగ్యానికి హానికరం. కాఫీ తాగేటప్పుడు కొంత చల్లారిన తర్వాత తేనె కలపడం లేదా స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగించడం మంచిది