Diwali Horoscope: దీపావళితో అదృష్టం వారి తలుపు తట్టినట్టే..! ఆ రోజున ఏ దేవతలను పూజించాలి?

దీపావళి సమయంలో వివిధ రాశుల వారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను కూడా పూజించడం చాలా మంచిది. కుజుడు అధిపతిగా ఉన్న మేష, వృశ్చిక రాశుల వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ, తులా రాశుల వారు దుర్గాదేవిని కూడా పూజించడం వల్ల ఆదాయ వృద్ధి కలుగుతుంది.

Diwali Horoscope: దీపావళితో అదృష్టం వారి తలుపు తట్టినట్టే..! ఆ రోజున ఏ దేవతలను పూజించాలి?
Diwali 2024 Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 26, 2024 | 4:56 PM

దీపావళి సమయంలో వివిధ రాశుల వారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను కూడా పూజించడం చాలా మంచిది. కుజుడు అధిపతిగా ఉన్న మేష, వృశ్చిక రాశుల వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ, తులా రాశుల వారు దుర్గాదేవిని కూడా పూజించడం వల్ల ఆదాయ వృద్ధి కలుగుతుంది. బుధుడు అధిపతిగా ఉన్న మిథున, కన్యా రాశుల వారు గణపతిని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. గురువు అధిపతిగా ఉన్న ధనుస్సు, మీన రాశులవారు నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల మనసులోని కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది. శని అధి పతిగా ఉన్న మకర, కుంభ రాశుల వారు శివార్చన చేయడం వల్ల ఉన్నత పదవులు పొందు తారు. రవి, చంద్రులు అధిపతులుగా ఉన్న సింహ, కర్కాటక రాశులవారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సరిపోతుంది.

  1. మేషం, వృశ్చికం: కుజుడి ఆధిపత్యం కలిగిన ఈ రాశుల వారు దీపావళి తర్వాత భాగ్యవంతులు కావడానికి బాగా అవకాశం ఉంది. వీరు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు సుబ్రహ్మణ్యస్వామిని కూడా పూజిం చడం వల్ల ఆదాయ ప్రయత్నాలతో పాటు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కూడా తప్పకుండా విజయ వంతం అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతాన యోగానికి కూడా అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.
  2. వృషభం, తుల: శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశులవారు దుర్గాదేవిని పూజించడం వల్ల ఆదాయం పెరగడం వ్యయం తగ్గడం జరుగుతుంది. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి. అవమానాలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
  3. మిథునం, కన్య: బుధుడు అధిపతిగా ఉన్న ఈ రాశులవారు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా ఆరాధించడం వల్ల ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలతో పాటు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విజయాలు సాధిస్తారు. నిరుద్యో గులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  4. ధనుస్సు, మీనం: గురువు అధిపతిగా ఉన్న ఈ రాశులవారికి ఈ సంవత్సరమంతా బాగా అనుకూలంగానే ఉన్న ప్పటికీ, నరసింహస్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరడమే కాకుండా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు అరు దైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం, కుంభం: శనీశ్వరుడు అధిపతిగా ఉన్న ఈ రాశుల వారు దీపావళి రోజున శివార్చన లేదా అభిషేకం చేయించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు పొందడంతో పాటు సామాజికంగా మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. జనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి