AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఏడాది చివరి వరకు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..! అందులో మీ రాశి ఉందా?

డబ్బు సంపాదించడంలోనే కాదు.. డబ్బు కూడబెట్టే విషయంలో కూడా కొన్ని రాశుల వారు ముందు వరుసలో ఉంటారు. వీరిలో ఆర్థిక విజయం అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ రాశులకు, రాశినాథులకు డబ్బు సంపాదించడంలో తెలివితేటలు అపారంగా ఉంటాయి. సంపదను పెంచుకోవడంలో, ముఖ్యంగా ఈ ఏడాది చివరి లోగా అత్యధికంగా సంపాదించడంలో ఆరు రాశులు ముందున్నాయి.

Money Astrology: ఏడాది చివరి వరకు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..! అందులో మీ రాశి ఉందా?
Money Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 28, 2024 | 6:01 PM

Share

డబ్బు సంపాదించడంలోనే కాక, డబ్బు కూడబెట్టే విషయంలో కూడా కొన్ని రాశుల వారు ముందు వరుసలో ఉంటారు. వీరిలో ఆర్థిక విజయం అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ రాశులకు, రాశినాథులకు డబ్బు సంపాదించడంలో తెలివితేటలు అపారంగా ఉంటాయి. సంపదను పెంచుకోవడంలో, ముఖ్యంగా ఈ ఏడాది చివరి లోగా అత్యధికంగా సంపాదించడంలో ఆరు రాశులు ముందున్నాయి. అవిః వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులు. ఈ రాశుల అధిపతులు ఈ ఏడాదంతా అనుకూలంగా ఉండడం వల్ల వీరిలో ధన సంపాదనకు సంబంధించిన ప్రతిభా పాటవాలు, సమర్థత మరింతగా వృద్ధి చెందుతాయి.

  1. వృషభం: విలాసాలకు, సౌకర్యాలకు, భోగభాగ్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారికి ధన సంపాదన మీద మోజు ఎక్కువగా ఉంటుంది. సంపదను పెంచుకోవడానికి చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఈ ఏడాది ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆస్తిపాస్తులు పెంచుకునే అవకాశం ఉంది.
  2. సింహం: ఆత్మవిశ్వాసానికి, సరికొత్త ఆలోచనలకు మారుపేరైన ఈ రాశివారికి ధన సంపాదన మినహా మరో ప్రపంచం ఉండదు. ఆర్థిక విషయాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు. వారిలోని నాయకత్వ లక్షణాలు, ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకునే అలవాట్లు వారికి తప్పకుండా సంపదను సృష్టి స్తాయి. వీరికి కష్టపడడం, తమ లక్ష్యాలను సాధించుకోవడం క్షుణ్ణంగా తెలుసు. రాశ్యధిపతి రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఈ ఏడాది సంపన్నుల కోవలో చేరడం జరుగుతుంది.
  3. కన్య: ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో, ప్రణాళికలు రూపొందించడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో సిద్ధహస్తులైన ఈ రాశివారు సాధారణంగా ధన సంపాదనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుం టారు. వీరి మనసంతా సంపాదన చుట్టూనే తిరుగుతుంటుంది. పొదుపు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, సంపదను పెంచుకోవడంలో వీరు ఘన విజయాలు సాధించడానికి రాశ్యధిపతి బుధుడు ఈ ఏడాదంతా చేయూతనందించబోతున్నాడు.
  4. వృశ్చికం: ధన సంపాదనావకాశాలు ఈ రాశివారికి ముందుగానే గోచరిస్తాయి. ఎలా డబ్బు సంపాదించాల న్నది వీరికి బాగా తెలుసు. వీరు రిస్కు తీసుకోవడానికి వెనుకాడరు. ఆర్థిక వ్యవహారాల్లో వీరు అంత త్వరగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉండదు. అవకాశాలను గుర్తించడంలో వీరికి వీరే సాటి. ఆర్థికంగా ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సిద్ధపడే ఈ రాశివారికి ఈ ఏడా దంతా రాశ్యధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల పట్టుదలతో సంపదను పెంచుకుంటారు.
  5. మకరం: పట్టుదలకు మారుపేరైన ఈ రాశివారిలో ఆర్థిక భద్రతకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఎంతటి శ్రమకైనా వెనుకాడరు. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, ఆ దిశగా గట్టిగా కృషి చేయడం వీరికి అలవాటుగా ఉంటుంది. క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. రాశ్యధిపతి, ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉన్నందువల్ల వీరికి ఆర్థిక విజయాలు, స్థిరత్వం లభిస్తాయి.
  6. కుంభం: ఈ రాశివారికి ముందు చూపు ఎక్కువ. ఆర్థిక విషయాల్లో సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం వీరి ధ్యేయంగా ఉంటుంది. తమలో ఉన్న ప్రతిభను, నైపుణ్యా లను పణంగా పెట్టి వీరు సంపాదన పెంచుకునే అవకాశం ఉంటుంది. స్వతంత్ర భావాలు కలిగిన ఈ రాశివారు ఎవరి మీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికే సంపద కోరుకుం టారు. ఈ రాశినాథుడైన శని ప్రస్తుతం బలంగా ఉండడం వల్ల వీరి ఆర్థిక లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి.