AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gruha Yoga: కుజ గ్రహ ప్రభావం.. ఆ రాశుల వారికి సొంతింటి కల నెరవేరడం పక్కా..!

Kuja Gochar: స్థిర, చరాస్తులకు కారకుడు కుజుడు. ఈ గ్రహం జనవరి 20 వరకూ కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నందువల్ల కొన్ని రాశులకు గృహ యోగాన్ని కలిగించే అవకాశం ఉంది. పొలాలు, స్థలాలకు కూడా కుజుడు కారకుడైనందువల్ల భూ సంబంధమైన స్థిరాస్తులను కొనుక్కునే అవ కాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కావడం, విలువైన ఆస్తి లభించడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం కూడా జరుగుతుంది.

Gruha Yoga: కుజ గ్రహ ప్రభావం.. ఆ రాశుల వారికి సొంతింటి కల నెరవేరడం పక్కా..!
Gruha Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 28, 2024 | 3:23 PM

Share

స్థిర, చరాస్తులకు కారకుడైన కుజుడు జనవరి 20 వరకూ కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నందువల్ల కొన్ని రాశులకు ఈ గ్రహం గృహ యోగాన్ని కలిగించే అవకాశం ఉంది. పొలాలు, స్థలాలకు కూడా కుజుడు కారకుడైనందువల్ల భూ సంబంధమైన స్థిరాస్తులను కొనుక్కునే అవ కాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం కావడం, విలువైన ఆస్తి లభించడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం కూడా జరుగుతుంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఈ విషయంలో విశేషంగా ప్రయోజనాలు పొందడం జరుగు తుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు చర, స్థిరాస్తులకు సంబంధించిన చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా భూ లాభం కలుగుతుంది. స్థిరాస్తులను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు కలుగుతాయి. దాయాదులతో ఉన్న ఆస్తి సమస్యలు, వివాదాలు కొద్ది ప్రయత్నంతో బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. సొంత ఇంటిని, వాహనాన్ని సమకూర్చుకుంటారు. ఆస్తి, భూ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశిలోనే సంచారం చేస్తున్న కుజుడు కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి తప్పకుండా సొంత ఇంటి కలను నెరవేరుస్తాడు. వాహన యోగం కూడా పడుతుంది. తల్లితండ్రుల నుంచి భూ లాభం, సంపద లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. స్థిరా స్తులతో పాటు చరాస్థులు కూడా పెరిగే అవకాశం ఉంది. స్థలాల కొనుగోలు మీద దృష్టి పెడతారు.
  3. కన్య: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల తప్పకుండా భూ లాభం కలుగుతుంది. అనేక విధాలుగా ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవు తాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తిపాస్తులు సమకూరు తాయి. భూమి క్రయ విక్రయాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కుజుడి కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా రాబడి అంచ నాలకు మించి పెరిగే అవకాశం ఉంది. చరాస్తులు వృద్ధి చెందడంతో స్థిరాస్తులు కూడా పెరిగే అవ కాశం ఉంది. స్థలాల కొనుగోలు మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. ఆస్తి వివాదాలను రాజీ మార్గంలోనైనా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న కోర్టు కేసులు కూడా కోర్టు బయట పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. అనేక విధాలుగా చరాస్తులు పెరుగుతాయి. స్థలాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ఇదివరకు కొన్న స్థలాల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరి ష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. వివాదాలకు మధ్యవర్తిత్వం వహించి లాభాలు పొందుతారు.
  6. మకరం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉండి ఈ రాశిని వీక్షిస్తున్నందు వల్ల తప్పకుండా స్థిర, చరాస్తుల సంబంధమైన లాభాలు కలుగుతాయి. సొంత ఇంటితో పాటు ఇతరత్రా కూడా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వారితో పాటు రైతులు కూడా ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందే సూచనలున్నాయి. అనుకోకుండా పిత్రార్జితం లభిస్తుంది.