Horoscope : ఆ రాశి వారికి ఊహించని ధనయోగం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

మేషం వారికి వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. మకరం వారికి.. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. . మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం....

Horoscope : ఆ రాశి వారికి ఊహించని ధనయోగం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 04th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2024 | 2:40 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన ఫలితం ఉంటుంది. కుటుంబ వ్యవహా రాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.పిల్లల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందు తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో అదనపు బాధ్యతలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు కుదర్చుకుంటారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగం మారడా నికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం లేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడ తారు. సోదరులతో వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకా శాలు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూ లంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి కొద్దిగా బయటపడ తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) కొద్దిగా ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వా మితో కుటుంబ వ్యవహారాలను కలిసి చక్కదిద్దుతారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు పనికి రావు. ఉద్యోగ వాతావరణం సామాన్యంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి కరు వవుతుంది. ఉద్యోగంలో కొందరు సన్నిహితులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, బాగా ఆలోచించి ఖర్చులు చేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. తోబుట్టువులతో చాలా కాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వ్యాపా రాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభి స్తుంది. బాధ్యతలు మారే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్నంగా కూడా లాభాలు అందుకుంటారు. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందే అవకాశం ఉంది. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఇతరులకు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో తప్పకుండా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) సోదరులతో ఆస్తి, ఆర్థిక వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగుల బాధ్యతల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఆధ్మాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2) ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుని పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధి కారుల అండదండలు వృద్ధి చెందుతాయి. ఆదాయం సంతృప్తికర స్థాయిలో పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా, చురు కుగా పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపో తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితా లనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అనుకోకుండా కొద్దిగా సంపద కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ