Kuja Stambhana 2024: కుజ స్తంభనతో ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
Kuja Stambhana Effect: ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు ఎటూ కదలకుండా ఆగిపోవడం జరిగింది. దీన్ని కుజ స్తంభన అంటారు. సాధారణంగా కుజుడు తన నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా కదలికలను కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని రాశులకు తప్పకుండా అధికార యోగం, వృద్ధి యోగం, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు ఎటూ కదలకుండా ఆగిపోవడం జరిగింది. దీన్ని కుజ స్తంభన అంటారు. సాధారణంగా కుజుడు తన నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా కదలికలను కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభ, మీన రాశులకు తప్పకుండా అధికార యోగం, వృద్ధి యోగం, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇది జనవరి 21 వరకూ కొనసాగుతుంది. కాగా, మిగిలిన రాశులకు కుజ స్తంభన వల్ల మానసిక ఒత్తిడి, పని భారం, కోపతాపాలు, అసహనాలు, అనారోగ్యాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వారు ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కుజ స్తంభన దోషం తగ్గిపోతుంది.
- వృషభం: ఈ రాశికి తృతీయంలో కుజుడు స్తంభించడం వల్ల కలలో కూడా ఊహించని పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమై, భూలాభం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా పయనం సాగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడు స్తంభించడం వల్ల జనవరి 21వ తేదీ వరకూ అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కూడా బాగా ఉపశమనం లభిస్తుంది. కొందరు ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజ స్తంభన వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. జీత భత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ ఏర్పడుతుంది. మంచి సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వా నాలు అందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లవలసి వస్తుంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో స్తంభించడం వల్ల అనుకోకుండా సిరిసంపదలు వృద్ధి చెందు తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. భూలాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. తండ్రి వైపు నుంచి సంపదలు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బాగా తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజుడు స్తంభించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతాలు పెరగడం, హోదా పెరగడం వంటివి తప్పకుండా సంభవిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి అవకాశాలు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ స్తంభన వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. తప్పకుండా అధికార లాభం కలుగుతుంది. కొన్ని కుటుంబ, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తయి ఊరట చెందుతారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి