Digbala Yoga: నవంబర్ మాసంలో ఆ రాశుల వారికి అధికార యోగం.. మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి..!

ప్రస్తుతం కుజ, రవి, శుక్ర, బుధ గ్రహాల రాశి మార్పుల వల్ల కొత్త రాశుల వారికి దిగ్బల యోగం పట్టడం జరిగింది. బుధ, గురువులు లగ్నంలో (రాశిలో), శుక్ర, చంద్రులు చతుర్థంలో, శని సప్తమ స్థానంలో, కుజ, రవులు దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దిగ్బల యోగం ఏర్పడుతుంది. వీటివల్ల ప్రధానంగా అధికార యోగం పడుతుంది.

Digbala Yoga: నవంబర్ మాసంలో ఆ రాశుల వారికి అధికార యోగం.. మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి..!
Digbala Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 05, 2024 | 6:39 PM

ప్రస్తుతం కుజ, రవి, శుక్ర, బుధ గ్రహాల రాశి మార్పుల వల్ల కొత్త రాశుల వారికి దిగ్బల యోగం పట్టడం జరిగింది. బుధ, గురువులు లగ్నంలో (రాశిలో), శుక్ర, చంద్రులు చతుర్థంలో, శని సప్తమ స్థానంలో, కుజ, రవులు దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దిగ్బల యోగం ఏర్పడుతుంది. వీటివల్ల ప్రధానంగా అధికార యోగం పడుతుంది. పలుకుబడి పెరగడం, గుర్తింపు లభించడం, ప్రముఖులతో పరిచయాలు పెరగడం, ఆర్థిక స్థితి మెరుగుపడడం వంటివి ఈ దిగ్బల యోగం వల్ల కలుగుతాయి. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం వారికి ప్రస్తుతం ఈ యోగం కలిగింది.

  1. వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. వచ్చే ఏడాది మే 25 వరకూ కొనసాగుతున్న ఈ యోగం వల్ల వీరికి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి వీరు పూర్తిగా బయటపడడం జరుగు తుంది. ప్రము ఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది.
  2. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. వచ్చే ఏడాది మే వరకూ కొనసాగే ఈ యోగం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. ఆదాయ వృద్ధి కలిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  3. తుల: ఈ రాశికి పదవ స్థానంలో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. జనవరి 21 వరకూ కొనసాగే ఈ యోగం వల్ల ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవ కాశం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థికాభి వృద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. ఈ యోగం జనవరి 4 వరకూ కొనసాగుతుంది. దీనివల్ల వీరు అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగు తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. మకరం: ఈ రాశికి పదవ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. ఈ నెల 16 వరకూ కొన సాగే ఈ యోగం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధ మైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందు తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నవారికి వారి కోరిక నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?