Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 06th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్ట వలసి వస్తుంది. భూ లాభం కలిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీ కరిస్తారు. తల్లి అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో అనుకూల, ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మనసులోని కొన్ని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్తంత మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గే అవకాశం లేదు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఆదా యం క్రమంగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కష్టార్జితంలో కొద్ది భాగాన్ని ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం జరుగుతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. డబ్బు తీసుకోవడం, ఇవ్వడం వంటివి చేయకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బాధ్యతలు, పని భారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. స్థాన చలనానికి లేదా ఇల్లు మారడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. గృహ, వాహన సౌక ర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రభుత్వంతో అనుకూలతలు ఏర్పడతాయి. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆదాయంలో కొద్ది పాటి పెరుగుదల ఉంటుంది. ప్రతిభ, సమర్థత వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవు తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. సొంత ఇంటి కోసం కృషి చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపా రాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా వృద్ధి చెందుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు విస్తరించడం, వాటి మీద శ్రమ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మీద కూడా శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ది ఉండ వచ్చు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్లో సానుకూలతలు తగ్గుతాయి. ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయానికి, ఆరో గ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అప్రయత్న కార్యసిద్ధికి బాగా అవకాశం ఉంది. ఆశించిన మార్గాల్లో కాకుండా ఆశించని మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా మదుపు చేయడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. శత్రువులు, పోటీదార్ల మీద విజయాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితం సాను కూలంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో డిమాండ్ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది. రావలసిన సొమ్ము అవసర సమయంలో అందుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడకపోవడం మంచిది. కొత్త పరిచయాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ఇబ్బంది పడతారు. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవు తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానే ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యో గంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కలుగుతాయి. సోదరు లతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడ తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖశాంతులు పెరుగు తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?