Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 07, 2024): మేష రాశి వారు ఈ రోజు స్వల్ప అనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 07th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 07, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 7, 2024): మేష రాశి వారు స్వల్ప అనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని కీలక బాధ్యతలను జాగ్రత్తగా నిర్వరిస్తారు. వృత్తి జీవితానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు యథావిధిగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. అయితే, కుటుంబ సభ్యుల ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయా ణాలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు కలుగుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవు తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు ప్రముఖులు పరిచయం అవు తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. శత్రు సంబంధమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా లాభ సాటిగా సాగుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవ కాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాలు, ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. దైవ కార్యాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కీలక మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోతుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుం బంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. లాభాలకు, రాబడికి అవకాశాలు పెరు గుతాయి. స్థిరాస్తి వివాదాలు, సమస్యలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండకపోవచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. వృథా ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికా రులు అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు మిత్రుల సహాయంతో అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు లాభ సాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. చేపట్టిన పనులన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. అద నపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు దొర్లకుండా అప్రమత్తంగా ఉండడం మంచిది. అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధనపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలపరంగా కొద్దిగా పురోగతి సాధి స్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో సత్పంబంధాలు ఏర్పడతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి