Moon Transit: మకర రాశిలో చంద్రుడు.. వారి మనుసులో కోరికలు, ఆశలు తీరే అవకాశం..!

Chandra Gochar: ఈ నెల (నవంబర్) 7 నుంచి 9 వరకు చంద్ర గ్రహం మకర రాశిలో సంచారం చేస్తుంది. చంద్రుడు మకర రాశిలో ఉన్న సమయంలో గురు, కుజుల దృష్టి ఈ గ్రహం మీద పడుతుంది. ఈ రెండు గ్రహాల దృష్టి ఫలితంగా కొన్ని రాశుల వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెగువ, చొరవ, సాహసం, పట్టుదల వంటి లక్షణాలు విజృంభించే అవకాశం ఉంది. కోరుకున్నవి సాధించుకునే అవకాశం ఉంటుంది.

Moon Transit: మకర రాశిలో చంద్రుడు.. వారి మనుసులో కోరికలు, ఆశలు తీరే అవకాశం..!
Chandra Gochar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 06, 2024 | 7:06 PM

ఈ నెల (నవంబర్) 7 నుంచి 9 వరకు చంద్ర గ్రహం మకర రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. చంద్రుడు మకర రాశిలో ఉన్న సమయంలో గురు, కుజుల దృష్టి ఈ గ్రహం మీద పడుతుంది. ఈ రెండు గ్రహాల దృష్టి ఫలితంగా కొన్ని రాశుల వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెగువ, చొరవ, సాహసం, పట్టుదల వంటి లక్షణాలు విజృంభించే అవకాశం ఉంది. కోరుకున్నవి సాధించుకునే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారి మనసుల్లోని కోరికలు, ఆశలు తీరే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తున్న వారి కలలు సాకారమవుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఈ రాశివారి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో చంద్ర సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ విష యంలో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి విషయంలో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేసే సూచనలున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి గానీ, సంపద గానీ లభించే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
  3. కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా కార్యకలాపాలు, గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో శక్తి సామర్థ్యా లకు, ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధి స్తారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.
  4. తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్ర సంచారం వల్ల నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. ఉన్నత వర్గా లతో సత్సంబంధాలు ఏర్పడతాయి. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో చంద్ర సంచారం వల్ల కోరుకున్న వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు, అపా ర్థాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పర్థలు, వివాదాలు సమసిపోతాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది.
  7. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో ప్రముఖులలో ఒకరుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు విస్తరిస్తాయి. లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి