Astrology: కార్తీక మాసంలో ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. పట్టిందల్లా బంగారమే..!

Kartika Masam 2024 Astrology: నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు ఉండే కార్తీక మాసంలో సాధారణంగా శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు జరగడం, గృహ ప్రవేశాలు జరగడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. శుభ కార్యాలకు సంబంధించిన గురు, శుక్రులు ఈ నెలంతా పరివర్తన చెందడం..

Astrology: కార్తీక మాసంలో ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. పట్టిందల్లా బంగారమే..!
Kartika Masam 2024 Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 06, 2024 | 6:44 PM

నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు ఉండే కార్తీక మాసంలో సాధారణంగా శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు జరగడం, గృహ ప్రవేశాలు జరగడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. శుభ కార్యాలకు సంబంధించిన గురు, శుక్రులు ఈ నెలంతా పరివర్తన చెందడం, ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం పెరగడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా శుభ ఫలితాలను అనుభవించబోతున్నది, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉన్నది మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, కుంభ రాశులకు మాత్రమేనని గ్రహ సంచారాన్ని బట్టి అర్థమవుతోంది.

  1. మేషం: ఈ రాశికి కుటుంబ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో తప్పకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధించడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరవచ్చు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: ఈ రాశిలో గురువు, అష్టమ స్థానంలో, అంటే మాంగల్య స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా వివాహ యోగం పడుతుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లయ్యే అవ కాశం ఉంది. అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి, ఆస్తుల విలువ పెర గడానికి, ఆస్తి లభించడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల తప్ప కుండా వివాహ యోగం పడుతుంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయం సాధిస్తాయి. గృహ ప్రవేశం చేసే సూచనలున్నాయి. ఇంట్లో ఇతరత్రా కూడా కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల కుటుం బంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. భారీగా వస్త్రాభరణాలు కొనడం కూడా జరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారంతో పాటు గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దగ్గర బంధువులలోని సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. గృహ, వాహన యోగాలకు సంబంధించి చిన్న ప్రయత్నం చేపట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల కలలో కూడా ఊహించని వివాహ యోగం పడుతుంది. భాగ్యవంతుల కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఒకటి రెండు ధన యోగాలు పట్టే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  7. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు, లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల తప్పకుండా వివాహ యోగం పడుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. సొంత ఇంటి కల సాకారం అవుతుంది. కొద్ది ప్రయ త్నంతో భోగభాగ్యాలు కలుగుతాయి. కుటుంబంలో ఇతరత్రా కూడా శుభ కార్యాలు జరిగే అవ కాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి