YV Subba Reddy: అమిత్‌షా స్టీల్‌ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు.. బీజేపీ.. టీడీపీ ట్రాప్‌లో పడింది..
YV Subba Reddy on BJP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014-19 వరకు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు.
YV Subba Reddy on BJP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014-19 వరకు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. అవినీతి చేసింది టీడీపీ, బీజేపీ.. ఆ రెండు పార్టీలేనంటూ వైవీ. సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం లేదా.? 2014-19 వరకు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారుు. బీజేపీ.. టీడీపీ ట్రాప్‌లో పడిపోయిందని విమర్శించారు. బీజేపీ సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలేనంటూ పేర్కొన్నారు. టీడీపీ మాటలే ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారని.. గతంలో రాష్ట్రానికి ఏమని మాటిచ్చారు.. ఇప్పుడేం చేశారన్న దానికి అమిత్‌షా సమాధానం చెప్పి ఉంటే చాలా సంతోషించేవాళ్లమంటూ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
విశాఖపట్నం నగరానికి వచ్చిన అమిత్ షా.. ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమని పేర్కొన్న వైవీ సుబ్బారెడ్డి.. స్టీల్‌ప్లాంట్ గురించి అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖపట్నం జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..