AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హిందూపురం వైసీపీలో టికెట్‌ చిచ్చు.. మారిన లెక్క.. బలప్రదర్శనకు రెడీ అంటున్న పాతనేతలు..

AP politics: హిందూపురం వైసీపీలో టికెట్ చిచ్చు రాజుకుంటోంది. ఎమ్మెల్సీ ఇక్బాల్ బల ప్రదర్శనకు దిగుతున్నారట. రాబోయే ఎన్నికల్లో హిందూపురం వైసీపీ టికెట్ పై క్లారిటీ వచ్చేసినట్లేనా? దుకే ఎమ్మెల్సీ ఇక్బాల్ తిరుగుబాటుకు రెడీ అవుతున్నారా? బీసీ కోటాలో తెరపైకి కొత్త ముఖం రానుందా?

Andhra Pradesh: హిందూపురం వైసీపీలో టికెట్‌ చిచ్చు.. మారిన లెక్క.. బలప్రదర్శనకు రెడీ అంటున్న పాతనేతలు..
Hindupur
Sanjay Kasula
|

Updated on: Jun 12, 2023 | 6:00 PM

Share

Hindupur Politics: గ్రూపు రాజకీయాలతో కొంత కాలంగా రచ్చకెక్కుతున్న హిందూపురం వైసీపీలో టికెట్ వ్యవహారం అగ్గిరాజేస్తోంది. హిందూపురం వైసీపీ టికెట్‌పై క్లారిటీ రేసులో ఉనన్ ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొత్త వ్యక్తి తెరపైకి రావడాన్ని పాతనేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీనిపై అధినేతతోనే నేరుగా తేల్చుకుంటానంటున్నారట ప్రస్తుత నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్. నియోజకవర్గంలో ఆయన బలప్రదర్శనకైనా సిద్ధమేనంటున్నారట ఆయన అనుచరులు. టీడీపీ కంచుకోట హిందూపురంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలి అనుకుంటున్న వైపీపీ పెద్దలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిన్నమొన్నటిదాకా మూడు గ్రూపులు..ఆరు గొడవలన్నట్లు నిత్యం రచ్చకెక్కుతున్న హిందూపురం నేతల వ్యవహారం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది . దీంతో వైసీపీ రాయలసీమ కో ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. హిందూపురంలో పార్టీ బలాలు, బలహీనతలను అధ్యయనం చేసిన మంత్రి పెద్దిరెడ్డి..అధిష్ఠాన పెద్దలతో కలిసి చక్కదిద్దేపనిలో ఉన్నారట. అందులో భాగంగానే ఈసారి బీసీ సామాజికవర్గానికి హిందూపురం టికెట్ కేటాయించాలని నిర్ణయించారన్న వార్తలతో ఆశావహులు అలర్ట్‌ అయ్యారు.

హిందూపురం వైసీపీ ఇంచార్జిగా ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన ఇక్బాల్ వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మద్దతు కూడగట్టుకుంటూ.. వ్యతిరేకులను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఆయనున్నారు. సుమారు 50 వేలదాకా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లను నమ్ముకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ నియోజకవర్గంలో బల ప్రదర్శన చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు హిందూపురం వైసీపీ టికెట్‌కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సీనియర్ నేత, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్‌ తగ్గేదేలేదన్నట్లు పంతంమీదున్నారు. హత్యకు గురైన రామకృష్ణా రెడ్డి సోదరి మధుమతి కూడా టికెట్ రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఎవరికి వారు టికెట్‌ ఆశతో జనంలోకి వెళ్తున్న టైంలో అందరికీ ఈమధ్యే క్లారిటీ ఇచ్చిందట వైసీపీ అధిష్ఠానం. బీసీలకు టికెట్‌ ఇస్తున్నామని పార్టీ పెద్దలు చెప్పటంతో ఆశావహుల కలలు చెదిరిపోయినట్లయింది.

పంతాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించాని చెప్పేసిందట వైసీపీ అధిష్ఠానం. ఈసారి హిందూపురం సీటును బీసీలకు.. అది కూడా కురుబ సామాజికవర్గానికి కేటాయిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది పార్టీ. ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్‌తో దీనిపైనే విజయవాడలో చర్చించారట మంత్రి పెద్దిరెడ్డి. అయితే పార్టీ పెద్దల మాటలతో ఏకీభవించని ఇక్బాల్‌ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. అవసరమైతే నేరుగా ముఖ్యమంత్రితోనే నేరుగా మాట్లాడుకుంటానని తెగేసి చెప్పారట. సమావేశం తర్వాత హిందూపురానికి వచ్చిన ఇక్బాల్ తన అనుచరులు, మత పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో ఇక్బాల్‌కు టికెట్‌ ఇవ్వకుంటే పార్టీకి సహకరించేది లేదని హిందూపురం ముస్లింలు అల్టిమేటమిస్తున్నారు. ఇక్బాల్‌కి మద్దతుగా ర్యాలీ నిర్వహించటమే కాకుండా..మహిళలు అంబేద్కర్‌ కూడలిలో దువా చదివారు. దీంతో వైసీపీ పెద్దలకు టికెట్‌ వ్యవహారం తల్నొప్పిగా మారేలా ఉంది.

సామాజికసమీకరణాలను లెక్కలోకి తీసుకుని హిందూపురంలో బీసీ అభ్యర్థినే దించాలని ఫిక్సయిపోయింది వైసీపీ నాయకత్వం. హిందూపురానికి చెందిన వేణు రెడ్డి సతీమణి దీపిక కురుబ సామాజికవర్గానికి చెందిన మహిళ. దీంతో ఆమెకు టికెటిస్తే అందరూ కలిసి పనిచేస్తారని, బీసీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మొగ్గు చూపుతుందని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో జనంలోకెళ్తున్నారు దీపికారెడ్డి. మరోవైపు టికెట్ విషయంలో రాజీపడేది లేదన్నట్లున్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్‌. ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలిస్తున్నారు ఆయన అనుచరులు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో నియోజకవర్గానికి వెళ్లడంతో ఓడిపోయానని, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారట ఇక్బాల్‌. దానికోసమే నాలుగేళ్లుగా కష్టపడ్డానని చెబుతున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న హిందూపురంలో టికెట్ వివాదం ఫ్యాన్‌ పార్టీ కేడర్‌ని కలవరపెడుతోంది. బాలయ్య ప్రాతినిధ్యంతో టీడీపీకి కంచుకోటగా ఉన్నచోట ఈ పంచాయితీలేంటని తలపట్టుకుంటున్నారు వైసీపీ నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం