Andhra Pradesh: తగ్గేదేలే అంటున్న సూరీడు.. ఏపీలోని ఆ మండలాలకు అలర్ట్..
Heat Wave in Andhra Pradesh: రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. భానుడి ప్రతాపం తగ్గడం లేదు.. రాష్ట్రంలో మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. కొన్ని చోట్ల ఎండ.. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Heat Wave in Andhra Pradesh: రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. భానుడి ప్రతాపం తగ్గడం లేదు.. రాష్ట్రంలో మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. కొన్ని చోట్ల ఎండ.. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఏపీలో ఎండ వేడి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 43 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 266 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 294 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
సోమవారం మన్యం జిల్లా సాలూరులో 44.9°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.8°C, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో 44.5°C, ప్రకాశం జిల్లా దొనకొండ, కాకినాడ జిల్లా కరపలో 43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 184 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదుర గాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు కాపరులు చెట్ల క్రింద ఉండరాదని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..