AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: నిరర్థక ఆస్తులను అమ్మకానికి పెట్టిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్.. 25 ఎకరాల్లోని..

Visakhapatnam Steel Plant: రండి బాబూ రండి..ఆలసించిన ఆశాభంగం..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మీదే లేట్‌.. ఇంట్రెస్ట్‌ ఉన్న వాళ్లు ఎవరైనా సరే వచ్చేయండి.. స్టీల్ ప్లాంట్‌ భూములు కొనేయండి.. ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. అని స్టీల్‌ ప్లాంట్‌ ఓ నొటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. అందుకోసం పది రోజుల గడువు కూడా ఇచ్చింది.

Vizag: నిరర్థక ఆస్తులను అమ్మకానికి పెట్టిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్..  25 ఎకరాల్లోని..
Vizag Steel Plant
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2023 | 5:36 PM

Share

వాహనం నడవాలంటే ఇంధనం కావాలి..మనిషి బతకాలంటే అన్నం తినాలి.. ఒక కర్మాగారం నిర్వహించాలంటే నిధులు కావాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి కావాల్సింది దొరక్కపోయినా ఆ బండి ఆగిపోతుంది. ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి అదే.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టీల్‌ ప్లాంట్‌.. రోజురోజుకూ దయనీయ స్థితికి చేరుకుంటోంది. తాను బతకడం కోసం..తన ఆస్తులను తానే అమ్ముకుంటున్న దైన్యస్థితికి చేరుకుంది.. స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులు అమ్మబడును అని నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అందులో పని చేసే ఏ కార్మికుడూ..తల్లిలాంటి స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి వస్తుందని ఏనాడు అనుకుని ఉండడు. కానీ కాలం ఎవరి చేతుల్లో ఉండదు కదా..

వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. కర్మాగారం మనుగడ కోసం నిధులు సమకూర్చుకునే పనిలో పడింది. ఇందుకోసం గతంలో విడుదల చేసిన ప్రకటనలు ఎలాంటి ఫలితాలనివ్వలేదు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం మూలధన వ్యయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమధ్య చెప్పినా..అది ఆచరణ లో కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్లాంట్ మరో దారి చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది., స్టీల్‌ ప్లాంట్‌ బయట నిరర్ధకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటోంది యాజమాన్యం.

విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ కు ఉన్న 25 ఎకరాల్లోని 588 క్వార్టర్స్, 84 ఇళ్ల విక్రయానికి తాజాగా ప్రకటన జారీ చేసింది. ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లు పది రోజుల్లో సంప్రదించాలని స్పష్టం చేసింది. పూర్తి స్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం చెబుతోంది.. మరి సేల్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా.. మళ్లీ నాటి వెలుగులు కర్మాగారంలో చూడగలమా..!

మరిన్ని ఏపీ వార్తల కోసం..