Krishna District: చేపల కోసం కాలవలో వల పెట్టిన జాలర్లు.. పడ్డాయేమో అని వెళ్లి చూడగా…

Machilipatnam: పామును చూస్తేనే వామ్మో అంటారు... అలాంటిది 15 అడుగులకు పైగా ఉండే కొండచిలువను చూస్తే ..బాప్ రే అని దడుచుకుని చస్తారు. తాజాగా అలాంటి పైథాన్ కృష్ణాజిల్లాలో అలజడి రేపింది.

Krishna District: చేపల కోసం కాలవలో వల పెట్టిన జాలర్లు.. పడ్డాయేమో అని వెళ్లి చూడగా...
Fishing Net (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2023 | 6:48 PM

సాధారణంగా పాములంటే చాలామందికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. ఒక్కొసారి ఆహారం కోసం, ఆవాసం కోసం అవి దారితప్పి జనాల్లోకి వస్తాయి. కొన్నిసార్లు అనుకోకుండా అవి మనుషులకు తారసపడి చిక్కుల్లో పడతాయి. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గోకవరంలో అదే జరిగింది. చేపల కోసం కాలవలో వల కట్టారు మత్స్యకారులు. ఆ తర్వాత వెళ్లి చూడగా అందులో చేపలుగా బదులు పెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో అందరూ కంగుతిన్నారు.

అది సుమారు 15 అడుగుల పొడవు ఉంది. అయితే దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలెయ్యకుండా ఒడ్డుకు తెచ్చి కొట్టి చంపారు మత్స్యకారులు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పాములు లేదా ఇతర వన్యప్రాణులు కనపడినప్పుడు ఫారెస్ట్ సిబ్బంది సమాచారం ఇవ్వాలి కానీ ఇలా కొట్టి చంపడం కరెక్ట్ కాదంటున్నారు.

ప్రమాదవశాత్తూ ఏ పాము కరిచినా… బాధితుడికి ధైర్యం చెప్పడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అనవసరంగా భయపెట్టడం వల్ల గంటలోనే చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కింగ్‌ కోబ్రా వంటి ప్రమాదకర పాములు కరిచాక మూడు గంటల సమయం ఉంటుందని.. బాధితుడిలో ధైర్యం నింపకపోతే.. అంతకు ముందే ప్రాణాలు కోల్పోవడం ఖాయమంటున్నారు డాక్టర్స్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.