Andhra Pradesh: ఆ రోజే విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు పంపిణీ.. సీఎం జగన్ గుడ్ న్యూస్..
ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 8వ తరగతి విద్యార్ధులకు..
ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 8వ తరగతి విద్యార్ధులకు డిసెంబర్ 21న తన పుట్టినరోజున ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే వారికి చదువులు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తామన్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్ధులకు ఉచితంగా కిట్ల పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ప్రతీ విద్యార్ధికి 3 జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్యపుస్తకాలూ, డిక్షనరీ ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులుతెచ్చామన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చామని, టోఫెల్ పరీక్షలకు విద్యార్ధులను సిద్దం చేయడమే కాదు.. ఇంగ్లీష్ మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నామన్నారు. అలాగే పాఠశాలలు మొదలైన తొలి రోజే విద్యాకానుక అందించామన్నారు సీఎం జగన్.