AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టెంపుల్‌కే ఎందుకు విరాళాలు ఇస్తున్నారు..? పవన్‌కు ఎంత ముట్టిందో చెప్పాలి: పోతిన మహేష్

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేష్‌ నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రావడమే పవన్‌ అజెండానా? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసన్నారు. జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని?..

ఆ టెంపుల్‌కే ఎందుకు విరాళాలు ఇస్తున్నారు..? పవన్‌కు ఎంత ముట్టిందో చెప్పాలి: పోతిన మహేష్
Pawan Kalyan - Pothina Mahesh
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2024 | 3:44 PM

Share

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేష్‌ నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రావడమే పవన్‌ అజెండానా? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసన్నారు. జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని?. బినామీ పేర్లతో ఉన్న పవన్‌ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు. పవన్‌ ప్యాకేజ్‌ స్టార్‌ అనడానికి ఆధారలన్నీ ఉన్నాయని పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలో బయటపెడతానని తెలిపారు. జనసేన పార్టీ అకౌంట్‌లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్‌.

తిరుమల వెంకటేశ్వరస్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్‌కే పవన్‌ కల్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు పోతిన మహేష్‌. పవన్‌ వీరమల్లు సినిమాకు అసలు ప్రొడ్యూసర్‌ ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్‌పై దిల్‌రాజు ఐటీ అధికారులకు ఎందుకు కంప్లైట్ చేశారో చెప్పాలని పోతిన మహేష్ కోరారు.

పవన్‌ ఎజెండా చంద్రబాబును సీఎం చేయడమేనని.. కాపు యువతకు పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలను టీడీపీ జెండా మోసే కూలీలుగా మార్చారన్నారు. ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీనే లేదు.. పవన్‌ దారెటో ఆయనకైనా తెలుసా అంటూ పోతిన మహేష్‌ అన్నారు. పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసని.. జనసేన పార్టీ అకౌంట్‌లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..