రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

దట్టమైన అడవుల్లో మాత్రమే ఉండే పునుగుపిల్లి విశాఖలో ప్రత్యక్ష మైంది. యారాడ కొండ డాల్ఫిన్స్ నోస్ రోడ్ లో గాయపడి కనిపించింది. అటుగా వెళ్తున్న నేవి ఉద్యోగి దాన్ని చూసి చలించిపోయాడు. స్నేక్ క్యాచర్‎కు సమాచారం అందించ్చారు. పునుగుపిల్లికి సపర్యలు చేసి టీవీ9 సహకారంతో అటవీ అధికారులకు అప్పగించారు. అంతరించిపోయే జాతికి చెందింది ఈ పునుగు పిల్లి.

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Civet Cat
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 20, 2024 | 1:52 PM

దట్టమైన అడవుల్లో మాత్రమే ఉండే పునుగుపిల్లి విశాఖలో ప్రత్యక్ష మైంది. యారాడ కొండ డాల్ఫిన్స్ నోస్ రోడ్ లో గాయపడి కనిపించింది. అటుగా వెళ్తున్న నేవి ఉద్యోగి దాన్ని చూసి చలించిపోయాడు. స్నేక్ క్యాచర్‎కు సమాచారం అందించ్చారు. పునుగుపిల్లికి సపర్యలు చేసి టీవీ9 సహకారంతో అటవీ అధికారులకు అప్పగించారు. అంతరించిపోయే జాతికి చెందింది ఈ పునుగు పిల్లి. అడవుల్లో మాత్రమే అరుదుగా కనిపించే ఈ వన్య ప్రాణి జనావాసాల మధ్య ప్రత్యక్షమవడం చాలా విచిత్రమైన విషయమని నిపుణులు అంటున్నారు. శుక్రవారం ఉదయం విశాఖలో పాములు పట్టే నేర్పరి నాగరాజుకు దాల్ఫిన్స్ నోస్ నేవల్ క్వార్టర్స్ ఏరియా నుంచి ఓ ఫోన్ కాల్. ఏదో చిన్న పిల్లి లాంటి జంతువు గాయలతో రోడ్డుపై పడి ఉన్నట్టు సందేశం ఇచ్చారు. తరచూ పాముల కోసం ఫోన్ కాల్స్ వస్తుందాడంతో అదే అనుకుని హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు నాగరాజు. అక్కడకు వెళ్లే సరికి గాయలతో ఉన్న ఆ అడవి జంతువుని చూసాడు నాగరాజు. అది పూనుగు పిల్లిగా గుర్తించ్చాడు. రోడ్డు దాటుతుందాగా ఏదో వాహనం ఢీకొని ఉంటుందని గమనించాడు. దాన్ని సంరక్షించి వెటర్నరీ వైద్యుడితో ట్రీట్ మెంట్ చేయించానని టీవీ 9 తో చెప్పాడు నాగరాజు.

టీవీ9 సమాచారంతో..

సమాచారం టివీ9 కు తెలియడంతో ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ ఆధ్వర్యంలో గాయపడిన పూనుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. గాయలతో ఉన్న పునుగుపిల్లిని సంరక్షించి.. విశాఖ జూలో వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో ఉంచుతామని అన్నారు రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్.

అరుదైన పునుగుపిల్లి.. అందుకే ప్రత్యేకం..

వివారెడా కుటుంబానికి చెందిన పూనుగు పిల్లిని ఆంగ్లంలో సివేట్ క్యాట్ (Civet Cat ) అని, టాడి క్యాట్ (Toddy Cat) అని అంటారు. ఈ పిల్లుల్లో దాదాపు 38 జాతులు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఆసియా రకానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఎందుకంటే.. ఈ ప్రాంతంలో జీవించే పూనుగు పిల్లుల్లో గ్రంథుల నుండి ఒకరకమైన సుగంధ తైలం లభిస్తుంది. పునుగు పిల్లి భారత్, శ్రీలంక, మియాన్మార్, భూటాన్, థాయ్ లాండ్, సింగపూర్, కంబోడియా, మలేషియా, జపాన్ దేశాల్లో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

స్వామివారికి ఆ తైలంతో..

ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన పునుగు పిల్లులు శేషాచల అడవుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేళ్లపై లెక్కించదగ్గ అతి తక్కువ సంఖ్యలో మాత్రమే. పునుగు పిల్లి శరీరం.. గంధపు చెక్కకు రాసుకోవడం వల్ల పునుగు తైలం వస్తుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పునుగు పిల్లి తైలాన్ని వాడతారు. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం తర్వాత తల నుంచి పాదాలదాకా పూనుగు పిల్లి తైలం పులుముతారు. అందుకే పునుగుపిల్లి నుంచి సేకరించిన ఈ తైలాన్ని టీటీడీ నిల్వ చేసి ఉంచుతుంది. మొదట్లో శ్రీవారి సన్నిధిలో నాలుగైదు పునుగు పిల్లులను సంరక్షించేవారు. అటవీ, వన్యప్రాణ చట్టాలు అందుకు అంగీకరించకపోవడంతో వాటిని తిరుపతి, SV జూ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎస్వీ జూ పార్కులో మూడు పునుగు పిల్లులు మాత్రమే ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి