Rachamallu: ఆమె అనుమతిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు..
Rachamallu Siva Prasad Reddy: ఏపీలో రాజకీయాలు రోజుకో విధంగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ నేతలు మాటల తుటాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల
Rachamallu Siva Prasad Reddy: ఏపీలో రాజకీయాలు రోజుకో విధంగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ నేతలు మాటల తుటాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ జరిగిన పరిణామాలపై, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు వివరించాలని.. దీనికోసం గ్రామాల వారీగా టీడీపీ ప్రజా గౌరవ సభలను నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు పలు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజా గౌరవ సభల పేరుతో మా అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరమంటూ ఆయన వ్యాఖ్యానికించారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమంటూ పేర్కొన్నారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని నేను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ సూచించారు. భువనేశ్వరి అక్క.. తనని అనరాని మాటలు అని, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతి ఇస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతామంటూ పేర్కొన్నారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే..ఈనాడు చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడ్చడం బాగాలేదని తెలిపారు. దీనిని చంద్రబాబుకు మానుకోవాలంటూ రాచమల్లు విజ్ఞప్తి చేశారు.
Also Read: