AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Jawad: దూసుకొస్తున్న జొవాద్‌ ప్రళయం.. ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్..

Jawad Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు జోవాద్‌ గండం ముంచుకొస్తోంది. తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఏపీలో భారీగానే ఉండబోతోంది. ప్రస్తుతం జోవాద్‌ విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 320.. పారాదీప్‌కు 470 కిలోమీటర్ల

Cyclone Jawad: దూసుకొస్తున్న జొవాద్‌ ప్రళయం.. ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్..
Jawad Cyclone
Shaik Madar Saheb
|

Updated on: Dec 04, 2021 | 4:30 PM

Share

Jawad Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు జోవాద్‌ గండం ముంచుకొస్తోంది. తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఏపీలో భారీగానే ఉండబోతోంది. ప్రస్తుతం జోవాద్‌ విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 320.. పారాదీప్‌కు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. తుఫాన్‌ దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర ఒడిశా కోస్తా వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. జోవాద్ తుఫాన్‌ ఒడిశాపై తీవ్ర ప్రభావం ఉంటుంది. 19 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయి. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. 19 జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేయడమే కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే.. ఏపీలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా వైపు తుఫాన్ వెళ్లినా రేపు సాయంత్రం వరకు అధికారులు పూర్తి స్థాయిలో అలెర్ట్‌గా ఉంటారన్నారు.

ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. జోవాద్‌ ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రలో ఇప్పటికే ముసురు పట్టింది. శ్రీకాకుళంలో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సహాయక చర్యల సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు విశాఖలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలర్ట్ అయింది. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను సైతం మోహరించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు బయటకు రావొద్దంటూ సూచనలు ఇస్తున్నారు.

కళింగపట్నం పోర్టులో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాయి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను సైతం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు నెలకొల్పారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల్ని నియమించింది ప్రభుత్వం. నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అయితే.. ఈ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Also Read:

Viral Video: రెస్టారెంట్‌లో ఆహారం తింటుండగా పడిపోయిన వ్యక్తిని ఎలా కాపాడారో చూడండి.. వీడియో వైరల్‌..!

Janhvi Kapoor: యాటిట్యూడ్ క్వీన్.. జాన్వీ కపూర్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..