AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెస్టారెంట్‌లో ఆహారం తింటుండగా పడిపోయిన వ్యక్తిని ఎలా కాపాడారో చూడండి.. వీడియో వైరల్‌..!

Viral Video: ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా టేబుల్‌పై పడిపోవడంతో అక్కడున్న వెయిటర్స్‌ ఆందోళనకు గురయ్యారు. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఫుడ్‌ తింటుండగానే టేబుల్‌పైనే..

Viral Video: రెస్టారెంట్‌లో ఆహారం తింటుండగా పడిపోయిన వ్యక్తిని ఎలా కాపాడారో చూడండి.. వీడియో వైరల్‌..!
Subhash Goud
|

Updated on: Dec 04, 2021 | 3:55 PM

Share

Viral Video: ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా టేబుల్‌పై పడిపోవడంతో అక్కడున్న వెయిటర్స్‌ ఆందోళనకు గురయ్యారు. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఫుడ్‌ తింటుండగానే టేబుల్‌పైనే పడిపోయాడు. వెంటనే స్పందించిన వెయిటర్స్‌, పోలీసు వచ్చి హీమ్లిచ్ పద్ధతి ద్వారా ప్రాణాలను కాపాడారు. అప్పుడప్పుడు ఆహారం తింటుండగా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తే ఆ వ్యక్తి పడిపోతుంటాడు. అలాంటి సమయంలో కొన్ని పద్దతులు ఉపయోగిస్తే ఆ వ్యక్తిని కాపాడవచ్చు. ఈ సీసీ పుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో 38 ఏళ్ల వ్యక్తి తన ఆహారాన్ని తింటూ ఊపిరి ఆడక టేబుల్‌పై కుప్పకూలిపోయాడు. రెస్టారెంట్‌లోని కస్టమర్లు, రెస్టారెంట్‌ సిబ్బంది వెంటనే గమనించి అతడిని లేపేందుకు ప్రయత్నించారు. అలాగే హైవే పెట్రోలింగ్ అధికారి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని పైకి లేపుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో అతను కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చాడు.రెస్టారెంట్‌లో అతని ప్రాణాలు కాపాడిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

హీమ్లిచ్ అంటే ఏమిటి?

హీమ్లిచ్‌ అంటే.. ఊపిరి పీల్చుకునే వ్యక్తి గొంతు నుండి ఆహారం లేదా ఇతర అడ్డంకులను తొలగించడానికి ఉపయోగించే ఒక సాంకేతికతను హీమ్లిచ్ అంటారు. ఒక వ్యక్తి మరొకరి వెనుక నిలబడి, వారి పిడికిలితో వ్యక్తి యొక్క పక్కటెముకలోకి పెద్ద థ్రస్ట్ ఇస్తాడు. ఆ వ్యక్తిని వెనుక భాగం నుంచి పట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇలా కొంత సేపు చేయడం ద్వారా మనిషి స్పృహలోకి వస్తాడు.

ఇది ఎలా పని చేస్తుంది?

గొంతు నుండి దేనినైనా తొలగించటానికి ఒకరి కడుపుపై ​నొక్కడం కొంచెం వింతగా అనిపిస్తుంది. కాని హీమ్లిచ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్ల గొంతు నుండి ఆహారాన్ని వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. గొంతులో ఏదో చిక్కుకున్నట్లు మీకు అనిపిస్తే.. దగ్గు వచ్చేలా ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి:

Asthma: అస్తమా ఉన్న పిల్లలు కరోనా బారిన పడితే ప్రమాదమే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..!

Baby teeth: పిల్లల్లో పాల దంతాలు ఊడిపోవడానికి కారణం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..!

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!