AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆకాశంలో తళుక్కుమన్న రైలు.. భయాందోళనలకు గురైన ప్రజలు.. వైరలవుతోన్న వీడియో..!

ఉత్తర భారతదేశంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో స్టార్ లింక్ కనిపించింది. జమ్మూతో పాటు పంజాబ్‌లోని అమృత్‌సర్, పఠాన్‌కోట్ ప్రాంతంలో ఆకాశంలో మెరిసే గీత కనిపించింది. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ దృశ్యం..

Viral Video: ఆకాశంలో తళుక్కుమన్న రైలు.. భయాందోళనలకు గురైన ప్రజలు.. వైరలవుతోన్న వీడియో..!
Elon Musk Starlink Satellites
Venkata Chari
|

Updated on: Dec 04, 2021 | 3:36 PM

Share

Elon Musk Starlink Satellites: అదేంటి ఆకాశంలో రైలు కనిపించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! అయితే ఇది రైలు కాదు కానీ, అలాగే వెలుగులు చిమ్ముతూ నింగిలో కనిపించే సరికి ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. మనదేశంలోనే కాదండోయ్.. చాలా దేశాల్లోనూ ఇది కనిపించిందంట. అసలు విషయం తెలుసుకున్నాక అంతా ఊపిరిపీల్చుకున్నారంట. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన టెస్లా యజమాని ఎలోన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహం శుక్రవారం సాయంత్రం భారతదేశంలో ఆకాశం గుండా ప్రయాణించింది. పంజాబ్‌లో దాదాపు 15 నిమిషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. దీంతో నెట్టింట్లో ఫోటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. మెరుస్తున్న స్ట్రీక్ నెట్టింట్లో వైరలవుతోన్నాయి. దీంతో ఆకాశంలో రైలు వెళుతున్నట్లు అనిపించింది. మొదట్లో ఈ దృశ్యాన్ని చూసి జనాలు భయపడ్డారు. ఆ తర్వాత ఫొటోలు, వీడియోలు తీస్తూ నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఉత్తర భారతదేశంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో స్టార్ లింక్ కనిపించింది. జమ్మూతో పాటు పంజాబ్‌లోని అమృత్‌సర్, పఠాన్‌కోట్ ప్రాంతంలో ఆకాశంలో మెరిసే గీత కనిపించింది. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక రకమైన భయానక పరిస్థితి నెలకొంది. దీని రహస్యాన్ని తెలుసుకునేందుకు భద్రతా సంస్థలు కూడా ప్రయత్నాలు ప్రారంభించాయి. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ లైట్ల రేఖ కనిపించిందని సమాచారం. శాంతిభద్రతలను కాపాడాలని జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రజలను కోరారు. ఇది స్టార్ లింక్ ఉపగ్రహమని, ఇది భారత్‌ను దాటి వెళ్లిందని జమ్మూ జోన్ ఏడీజీ ముఖేష్ సింగ్ తెలిపారు.

స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్.. ఎలోన్ మస్క్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించబోతోంది. ఈ పనిని ఆయన సంస్థ స్టార్ లింక్ చేస్తోంది. ఇందుకోసం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ప్రస్తుతం మరిన్ని ఉపగ్రహాలను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ కూడా శాటిలైట్ ద్వారా భారతదేశంలోని ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడు. అయితే అతను భారతదేశంలో ఇంకా లైసెన్స్ పొందలేదు.

భారతదేశం నుంచి స్టార్ లింక్ 5000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్‌లను కలిగి ఉంది. StarLink India ఇటీవల ఒక ప్రకటనలో భారతదేశంలో StarLink ఇంటర్నెట్ సర్వీస్ ప్రీ-ఆర్డర్ బుకింగ్‌ల సంఖ్య 5000 దాటింది. 2022 చివరి నాటికి కంపెనీ ఈ సౌకర్యాన్ని భారతదేశంలో ప్రారంభించవచ్చు అని పేర్కొంది. అయితే, భారతదేశం నుంచి స్టార్ లింక్ ఇంకా లైసెన్స్ పొందనందున, భారత ప్రభుత్వం ప్రీ-ఆర్డర్ చేయడానికి నిరాకరించింది.

జియోతో పోటీకి సిద్ధం.. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంపెనీ భారతదేశంలోని ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌తో పోటీపడుతుంది. స్టార్‌లింక్, వన్‌వెబ్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవను అందిస్తాయి. జియో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

Also Read: Viral Video: బాలీవుడ్ పాటకు ఇండోనేషియన్‌ యూట్యూబర్స్‌ స్టెప్పులు .. అమేజింగ్‌ అని ప్రశంసించిన అక్షయ్‌..

Video Viral: ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం చెప్పడానికి వచ్చిన కొడుకుని చెప్పుతో కొట్టి హత్తుకున్న తల్లి.. వీడియో వైరల్..