Viral Video: బాలీవుడ్ పాటకు ఇండోనేషియన్‌ యూట్యూబర్స్‌ స్టెప్పులు .. అమేజింగ్‌ అని ప్రశంసించిన అక్షయ్‌..

కరోనా రెండో దశ ఉద్ధతి తర్వాత థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి బాలీవుడ్‌ సినిమా 'సూర్యవంశీ'. అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్ జంటగా నటించారు. రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవ్‌గణ్ అతిథి పాత్రలు పోషించారు.

Viral Video: బాలీవుడ్ పాటకు ఇండోనేషియన్‌ యూట్యూబర్స్‌ స్టెప్పులు .. అమేజింగ్‌ అని ప్రశంసించిన అక్షయ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 04, 2021 | 11:02 AM

కరోనా రెండో దశ ఉద్ధతి తర్వాత థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి బాలీవుడ్‌ సినిమా ‘సూర్యవంశీ’. అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్ జంటగా నటించారు. రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవ్‌గణ్ అతిథి పాత్రలు పోషించారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. నిన్న నెట్‌ఫ్లిక్స్‌లోనూ రిలీజైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలోని పాటలు అలరించాయి. ముఖ్యంగా ‘నాజానాజా’ అనే పాటకు అక్షయ్‌, కత్రినా వేసిన స్టెప్పులు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతోంది. నెటిజన్లు కూడా ఈ సాంగ్‌ను రీక్రియేషన్‌, స్ఫూప్‌లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, షార్ట్స్‌ చేస్తున్నారు.

కాగా ‘నాజానాజా’ పాటకు ఇండోనేషియాకు చెందిన అనే ఓ యూట్యూబర్‌ జంట అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. అక్షయ్‌- కత్రినా లను అనుకరిస్తూ సేమ్‌ అలాంటి కాస్ట్యూమ్స్‌ ధరిస్తూ సూపర్బ్‌గా స్టెప్పలేశారు. కాగా వారు డ్యాన్స్ చేసిన వీడియోకు హీరో అక్షయ్ కుమార్ సైతం ముగ్ధులయ్యారు. ఈ క్రమంలో ఇండోనేషియన్‌ జంట డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ‘మీ రీక్రియేషన్‌ నాకు బాగా నచ్చింది. అద్భుతమైన ప్రయత్నం’ పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో డ్యాన్స్ చేసిన వినఫాన్ అనే యూట్యూబర్‌ ఇండోనేషియాలో బాగా ఫేమస్‌ . బాలీవుడ్ పాటలకు కాలు కదుపుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. అందులో భాగంగానే ‘సూర్యవంశీ’ పాటను రీక్రియేట్‌ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోకు 3.6లక్షల వ్యూస్‌ రావడం విశేషం.

Also Read:

Payal Rajput : కన్నడ ఇండస్ట్రీ పై కన్నేసిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో పాయల్

Sai Pallavi: సోదరి మొదటి సినిమా విడుదల.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన సాయి పల్లవి..

Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట