Sai Pallavi: సిస్టర్ ఫస్ట్ సినిమా పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హైబ్రిడ్ పిల్ల..
సాయి పల్లవి.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ నేచురల్ బ్యూటీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందీ అందాల తార.
సాయి పల్లవి.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ నేచురల్ బ్యూటీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందీ అందాల తార. ఇప్పుడు సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా ఆమె బాటలోనే నడుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘చిత్తారాయి సెవ్వనం’ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని ప్రధానపాత్ర పోషించాడు. తెలుగు, తమిళ సినిమాల్లో ఫైట్‌మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్టంట్ సిల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. జీ తమిళ్, అమిర్తా, థింక్ బిగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తన చెల్లెలి సినిమా గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది సాయి పల్లవి.
ఆ ప్రేమలోనూ అంతే ఆనందం..
‘పూజా.. నీ గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకోనుంది. అనారోగ్యంగా ఉందని అమ్మనాన్నకు చెప్పి క్లాసులకు బంక్ కొట్టడం, నిరాశగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ముందుకు వెళ్లడం.. ఇలా ఆఫ్‌స్ర్కీన్‌లో నా ముందు నువ్వు ఎదగడం చూశాను. ఇప్పుడు ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమాతో ఆన్‌స్ర్కీన్‌పై అడుగుపెట్టింది. అందరూ ఈ సినిమాను చూసి నాలాగే నా సోదరిపై ప్రేమాభిమానాలు కురిపించాలని కోరుకుంటున్నాను. నా చెల్లిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సిల్వ సార్, సముద్రఖని సార్, ఇతర చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక పూజ.. ఈరోజు నీ ఫస్ట్ సినిమా విడుదలైంది. మనం సినిమాలో కనిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అభిమానులు కురిపించే ప్రేమలోనూ అంతే ఆనందముంటుంది. ఐలవ్యూ డియర్.. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతాను’ అని చెల్లిపై తన ప్రేమను కురిపించింది సాయి పల్లవి. కాగా ఈ సినిమా కంటే ముందుకు దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది పూజ. ఆ తర్వాత ‘కార’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.
View this post on Instagram
Also Read:
Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట