Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Deverakonda: ఈ కుర్ర హీరో “హైవే” పై దూసుకెళ్లేనా.? హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ..

ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`.

Anand Deverakonda: ఈ కుర్ర హీరో హైవే పై దూసుకెళ్లేనా.? హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ..
Anand
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2021 | 9:14 AM

Anand Deverakonda: ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. మూస కథల జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా సినిమా కథలను ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్. ఆతర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చేశాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా పుష్పక విమానంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అనే ధీమాతో ఉన్నాడు.

భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?