Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2021 | 9:36 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను పుష్ప ది రైజ్ అనే టైటిల్‏లో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పుష్ప ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు పుష్ప నుంచి అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే పుష్ప విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రష్మిక.

మూవీ త్వరలో విడుదల కాబోతుంది కదా సర్.. స్పెషల్‏గా ఏదైనా పంపించాలనిపించింది. అందుకే సర్‏ప్రైజ్ గిఫ్ట్ మీకోసం అంటూ చేతితో రాసి నోట్.. కొన్ని వస్తువులను బాక్స్ లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌, ముత్తమ్ శెట్టి మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Allu Arjun

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి.

Also Read: Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Kethika Sharma: నటిని కావాలనుకున్నాను.. కానీ ఏలా అయ్యానో నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Pushpa Trailer Tease: ట్రైలర్‏కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లేటేస్ట్ వీడియో..