Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2021 | 9:07 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇక అప్డే్ట్ కోసం ఇటీవల అభిమానులు చేసిన రచ్చ సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగింది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధే శ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తిచేసింది పూజాహెగ్డే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఇందులో ప్రభాస్ విక్రమాధిత్యగా కనిపించనుండగా.. పూజా హెగ్డే.. ప్రేరణ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్.. ఈ సినిమాతోపాటు ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Video Viral: వాటే టాలెంట్ గురూ.. పెయింట్‏తో అక్షరాల మాయ.. చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

Minister Harish Rao: రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించండి.. కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ..

FD vs IPO Investment: ఎఫ్‌డీల్లో డబ్బు ఐపీఓలకు.. మారిన పెట్టుబడిదారుల ధోరణి.. రూ. 2.67 లక్షల కోట్లు తగ్గిన బ్యాంకు డిపాజిట్లు..!